మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

  0
  3445

  మెగా కుటుంబాన్ని కూతుళ్ళ గండం వెంటాడుతోంది .. సినిమా రంగంలో కానీ, సేవా రంగంలో గాని , పాపులారిటీ లోగాని ,సెలబ్రిటీ హోదాలోగానీ , తెలుగు రాష్ట్రాల్లో నెంబర్ వన్ స్థానంలో ఉన్న మెగా ఫ్యామిలీ ఎందుకో కూతుళ్ళ గండంతో అప్పుడప్పుడు కష్టాల పాలు అవుతుంది . నాగబాబు కూతురు నిహారిక విషయంలో ఇప్పుడు మెగా ఫ్యామిలీ వివాదంలో చిక్కుకుని పోయింది . వాస్తవాలు ఎలా ఉన్నప్పటికీ ఉగాది రోజున నిహారిక పేరు డ్రగ్స్ కేసులో ప్రచారంలోకి రావడంతో కలకలం చెలరేగింది. ఈ విషయాన్నీ అడ్డం పెట్టుకొని ఆ కుటుంబాన్ని సోషల్ మీడియాలో నెటిజన్లు ఒక ఆట ఆడుకుంటున్నారు .. రకరకాల విమర్శలు ,వ్యాఖ్యలు, ఆరోపణలతో సోషల్ మీడియా హోరెత్తుతోంది . నిహారిక రాత్రి మూడు గంటల వరకూ పబ్ లోనే ఉండటం , ఆ తర్వాత ఆమెతోపాటు అందరిని స్టేషన్ కి తీసుకు పోయిన తర్వాత మధ్యాహ్నం 12 గంటల వరకు స్టేషన్లో ఉండటం ఇలా దాదాపు ఆమె 10 గంటల పాటు పోలీస్ స్టేషన్ లోనే గడపడం కూడా అనేకమైన విమర్శలకు దారి తీస్తోంది. ప్రతి విషయం పైన సోషల్ మీడియాలో మాట్లాడే నాగబాబు నోరు ఇప్పుడు మూత పడిపోయింది. బయటకు చెప్పుకో లేని పరిస్థితి వచ్చింది.. డ్రగ్స్ కేసుతో నిహారికకు ఏమీ సంబంధం లేదని చెబుతున్నప్పటికీ , ఈ సంఘటన మాత్రం మెగా ఫ్యామిలీని చుట్టేసింది..

  చిరంజీవి కానీ పవన్ కళ్యాణ్ కానీ యువత డ్రగ్స్ తో నిర్వీర్యం అయిపోతుందని ప్రత్యేక సందేశాలు ఇచ్చేవాళ్ళు .. యువత పెడదారి పట్టకుండా జాగ్రత్త పడాలి అని కూడా చెప్పేవారు. ఇందుకోసం చిరంజీవి ఒక ప్రత్యేకమైన సందేశాన్ని విడుదల చేశారు . పవన్ కళ్యాణ్ అయితే ఏపీలో జగన్ ప్రభుత్వం గంజాయి సాగు చేస్తోందని విపరీతమైన విమర్శలు చేసేవారు. ఇది ఆంధ్రప్రదేశా , గంజాయి ప్రదేశా అని కూడా విమర్శలు చేశారు . అయితే ఇప్పుడు ఏకంగా మెగా బ్రదర్ కు కూతురు పబ్ వివాదాల్లో చిక్కుకోవడం అనేకమైన విమర్శలకు దారి తీస్తోంది.

  గతంలో కూడా చిరంజీవి కూతురు ప్రేమ అ పెళ్లి సోషల్ మీడియాలో రభస , ఆమె వాదన ఇవన్నీ కూడా ఆ కుటుంబానికి మనశ్శాంతి లేకుండా చేశాయి. దీని నుంచి కోలుకునేందుకు చిరంజీవి కుటుంబానికి చాలా సమయమే పట్టింది . అయితే దురదృష్టం ఇప్పుడు నిహారిక రూపంలో మళ్లీ వెంటాడింది . ఎందుకంటే మెగా ఫ్యామిలీ లో చిరంజీవి యువతని మంచి దారిలో నడవమని ఇటీవల ఉపదేశం చేశారు . ఇప్పుడు నిహారిక పబ్ సంఘటన ,, పోలీసు రైడ్ జరిగిన తరువాత చిరంజీవి యువతకు ఇచ్చిన మెసేజ్ విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది . మీ ఇంట్లో పరిస్థితి చక్కదిద్దుకోండని , మీ ఇంట్లో వాళ్ళను మంచి మార్గంలో నడిపించి ఇలాంటి సందేశం ఇవ్వండంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి.

  అలాగే నాగబాబు తన సినీ , రాజకీయ ప్రత్యర్థులపై తరచుగా యూట్యూబ్లో కామెంట్స్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు కూతురు వల్ల ఆయనే వివాదంలోకి చిక్కుకుపోయాడు. ఒక రకంగా ఇక ఎవరినీ ఏమీ అనలేని పరిస్థితుల్లో నాగబాబు పడిపోయాడు. నిన్న తన కూతురికి డ్రగ్స్ తో సంబంధం లేదని ఆయన చెప్పిన మాట ఆ సమయంలో ఆయన పడుతున్న బాధ స్పష్టంగా ఆయన ముఖంలో కనిపించింది . ఇలా మెగా ఫ్యామిలీ ని , దురదృష్టం కూతుళ్ళ రూపంలో వెంటాడుతోంది . చిరంజీవి ఒక కూతురు ఒకప్పుడు మనశ్శాంతి లేకుండా చేస్తే ఇప్పుడు నిహారిక మనశ్శాంతి లేకుండా చేసింది. ఒక రకంగా ఆ కుటుంబానికి ఇది ఇబ్బందే.. ఇతరులకు మంచి మార్గంలో ఉండమని చెప్పడం ఇతరులపై విమర్శలు చేయడం ఇప్పుడు మెగా ఫ్యామిలీ కొంతకాలంపాటు కష్టమైన పని ఏమో..??

   

  ఇవీ చదవండి… 

  అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

  నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

  చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

  సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో.