మిమ్మల్ని తీసినా పెద్ద బాధ్యతే ఇస్తే.. మంత్రులకు ఓదార్పు.

    0
    691

    రాష్ట్ర మంత్రి వర్గాన్ని పునర్వ్యవస్తీకరిస్తానని ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. వైసిపి , సీఎల్పీ సమావేశంలోనే ఆయన ఈ విషయం ప్రకటించారు. ఎవరినైనా మంత్రి పదవులనుంచి తప్పిస్తున్నానంటే, వారికి మరింత బాధ్యత అప్పగిస్తున్నట్టు అనుకొండి. తప్పుదు అనుకున్న చోట, కొన్ని సామాజిక సమీకరణాల వల్ల కొన్ని కొన్ని మినహాయింపులు మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా ఉంటాయి అని చెప్పారు., కొత్త జిల్లాలకు కలిపి , రాష్ట్రంలో 26 జిల్లాలకు , కొత్తగా పార్టీ అధ్యక్షులను నియమిస్తారు. రీజనల్ కో ఆర్డినేటర్లను కూడా నియమిస్తారు. ఏప్రిల్ నెలాఖరుకల్లా జిల్లా , మండల , గ్రామ , పార్టీ కమిటీలు ఏర్పాటు చేస్తారు. జూలై 8 వతేదీన పార్టీ ప్లీనరీ సమావేశం ఏర్పాటు చేస్తానని చెప్పారు.

    ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఒక్కో గ్రామ సచివాలయానికి రెండు రోజులు పోవాలని .. మీరు ఏమిచేస్తున్నారని నేను రోజూ నివేదిక తెప్పిస్తానని అన్నారు. ఎమ్మెల్యేలు నిత్యం ప్రజల్లో ఉంటూ సమస్యలు పరిష్కరించాలి, నెలలో ఒక్కో సచివాలయాన్ని 4 రోజులు సందర్సించాలి , ఇలా చేస్తే ప్రజలు సమస్యలు , సంక్షేమ పధకాల అమలుపై అవగాహన ఉంటుందన్నారు. అసెంబ్లీ కమిటీ హాలులో వైయస్సార్‌ శాసనసభాపక్షనేత, ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ అధ్యక్షతన శాసనసభాపక్ష సమావేశం.లో ఆయన చెప్పిన విషయాలు ఇంకా..

    ప్రభుత్వం ఏర్పాటై 34 నెలలు కావొస్తోంది. మరో 2 నెలల్లో మూడు సంవత్సరాలు కూడా పూర్తి కావొస్తోంది ఇక పార్టీ పరంగా ప్రజల్లోకి వెళ్లే విధంగా కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది, ఆదిశగా అడుగులు వేయాలి నా అనుభవంతో నేను చెప్తున్నాను, ఇంటింటికీ, గడపగడపకూ వెళ్లడం కన్నా మరే ప్రభావవంతమైన కార్యక్రమం లేదు కనీసం మూడు సార్లు డోర్‌–డోర్‌టు కార్యక్రమం చేయాలికనీసం 2 సార్లు ప్రతి గడపకూ వెళ్లాల్సిన అవసరం ఉంది లేకపోతే ఎంతమంచి ఎమ్మెల్యే అయినా గెలవడం అన్నది ప్రశ్నార్థకంగా మారుతుంది అన్నారు. ఉగాది నుంచి వాలంటీర్లకు సన్మానం చేస్తున్నాం, వారి సేవలకు అవార్డులు ఇస్తున్నాం. వారు బాగా చేసిన మంచి పనులకు చాలామంది వాలంటీర్లకు మనం పారితోషికం, మెడల్‌ ఇవ్వడం చేస్తున్నాం, సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్రాల కింద అవార్డులు ఇస్తున్నాం: ఏప్రిల్‌ 2నుంచి ఉగాది రోజున జరిగే ఈ కార్యక్రమం నెలరోజులు సాగుతుంది అని చెప్పారు.

     

    ఇవీ చదవండి… 

    అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

    నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

    చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

    సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో..