ఇదిగో , పాయిజన్ ఫిష్.. మన రాష్ట్రంలో కనిపించింది.. మనిషిని పోలిన ముఖంతో ఉండే , ఈ చేప తూర్పుగోదావరిజిల్లా వాసాలతిప్ప సముద్రతీరంలో మత్స్యకారులకు దొరికింది. ప్రపంచంలో అత్యంత విషపూరితమైన చేపలతో ఇదొకటి.. విచిత్రం ఏమిటంటే , ఈ చేపను చాలా ఇష్టంగా తింటారు. అయితే ఈ చేపతో వంటకం చెయ్యాలంటే , ప్రత్యేకమైన లైసెన్స్ కావాలి . మన మత్స్యకారులు ఈ చేపను బొంక చేప అనికూడా అంటారు..
ఈ చేపతో వంటచేసి మాస్టర్ కి జీతం లక్షల్లో ఉంటుంది. ఎందుకంటే , ఏమాత్రం పొరపాటు జరిగినా , ఆ చేప వంటకం తిన్నవాళ్ళు చనిపోతారు. ఈ చేపలోని విషంతో , ఒక్క దఫా పదిమందిని చంపొచ్చు. అంతటి ప్రమాదమైన ఈ చేప , అప్పుడప్పుడు మత్స్యకారులకు కనిపిస్తుంటుంది. ఈ చేపను , బెలూన్ ఫిష్, పఫర్ ఫిష్, ఫుగు , గ్లోబ్ .. ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు. జపాన్ లో ఈ చేపతో చేసిన వంటకం చాలా ఖరీదైంది. ఈ చేప జపాన్ లో ఎక్కువగా దొరుకుతుంది. ఈ చేపతో వంటకాలను 16 వ శతాబ్దంలో నిషేదించారు. అయితే 1888 లో జపాన్ రాజు ఈ చేప వంటకాన్ని ఒక హోటల్లో రుచి చూసి , దానిపై నిషేధం ఎత్తివేశారు..