నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

  0
  571

  నాగచైతన్య, సమంత విడాకుల వ్యవహారం జరిగి నెలలు గడుస్తున్నా.. ఇంకా ఏదో ఒక విషయంలో వారిద్దరిపై వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. సమంత తాజాగా తన పెళ్లి చీరను నాగచైతన్యకు తిప్పి పంపించిందట. ఆ విషయంలో చైతన్య బాగా హర్ట్ అయ్యారని సమాచారం.

  చైతన్యకు సెంటిమెంట్..
  2017, అక్టోబర్‌6న హిందూ, క్రిస్టియన్‌ పద్ధతిలో నాగచైతన్య, సమంత పెళ్లి జరిగింది. పెళ్లి వేడుకలో సమంత ధరించిన పెళ్లి చీరపై అప్పట్లో తెగ చర్చ జరిగింది. అంతేకాదు ఈ చీర నాగ చైతన్యకు సెంటిమెంట్‌ అనే విషయం తెలిసిందే. పెళ్లి మండపంలో సమంత కట్టుకున్న ఆ చీర చైతన్య అమ్మమ్మ, రామానాయుడు భార్య దగ్గుబాటి రాజేశ్వరిది. అమ్మమ్మ అంటే చైతన్యకి చాలా ఇష్టం. అందుకే ఆమె గుర్తుగా ఆ చీరను సమంత రీమోడలింగ్‌ చేయించి దాన్ని ధరించింది. రీమోడలింగ్ కోసమే సుమారు రూ. 40 లక్షల వరకు ఖర్చయిందట.

  అయితే ఈపెళ్లి చీర విషయంలో సమంత షాకింగ్‌ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విడాకుల అనంతరం చైతన్యకి సంబంధించిన ఓ వస్తువు తనకు అక్కర్లేదని చెబుతోందట సమంత. ఇటీవల పెళ్లి చీర కనపడిందని, అందుకో దాన్ని వెంటనే ఆమె వెనక్కి పంపించిందని అంటున్నారు. ఆ చీర చూసి చైతన్య షాకయ్యారట.

  ఇవీ చదవండి… 

  బాబూ , బాబూ అంటూ ముద్దాడుతూ రోదిస్తున్న గౌతంరెడ్డి తల్లి

  మిస్ యూ గౌతమ్.. ఎమోషనల్ అవుతున్న బాల్య మిత్రులు..

  నా భార్య చీటర్.. ఆమె మోసాలతో నాకు సంబంధం లేదు..

  తాళి కట్టాక పెళ్లి కూతురు సినిమా చూపించింది..