అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

    0
    167

    సంపన్న దేశాల్లో ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో ఒంటెల అందాల పోటీలలో అందమైన ఒంటెను ఎంపిక చేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. అందాల భామల పోటీల్లో పాల్గొనేందుకు మహిళలు రకరకాల సర్జరీలు చేసుకుని అందంగా తయారవుతారు. అయితే అందాల ఒంటెల పోటీల్లో అందమైన ఒంటెను ఎంపిక చేయడంలో స్కానింగ్, ఎక్స్ రేలు, డాక్టర్ల పరీక్షలు.. ఇలా చాలా ఉంటాయి.

    ఖతర్ లో జరిగిన అందాల ఒంటెల పోటీల్లో మంగియా గుఫ్రాన్ అనే ఒంటె మిస్ క్యామెల్ ఖతర్ గా గెలిచింది. దీనికి మన కరెన్సీలో చెప్పాలంటే 2 కోట్ల రూపాయలు బహుమతిగా కూడా ఇచ్చారు. ఈ ఒంటెను విజేతగా నిర్ణయించే ముందు ఎక్స్ రే లు, స్కానింగ్ లు తీశారు. బొటాక్స్ లాంటి ఇంజెక్షన్లు ఏవైనా.. దాని అందానికి ఉపయోగించారా అని కూడా పరీక్షించారు. అవన్నీ లేవని నిర్థారించుకున్న తర్వాతే దీన్ని మిస్ క్యామెల్ ఖతర్ గా నిర్ణయించారు.

    సౌదీ అరేబియాకు చెందిన 43 ఒంటెలను వాటి అందం కోసం ఆపరేషన్ చేయించారనే కారణంగా పోటీనుంచి పంపించివేశారు. తన ఒంటెను ఇంత అందంగా తీర్చిదిద్ది బహుమతి గెలుచుకునేందుకు చాలా కష్టపడ్డానని, దాని యజమాని ఫాహిద్ అల్ గుఫ్రాని చెప్పాడు. ఈ ఒంటెల అందాల పోటీల్ని చూసేందుకు చాలామంది దేశ విదేశాలనుంచి కూడా వస్తుంటారు. ఈ పోటీలు నిర్వహించేందుకు ఓ ప్రత్యేక ప్రాంతం ఉంటుంది. అక్కడే వెటర్నరీ ఆస్పత్రులు ఉంటాయి.

    ప్రపంచంలో అతి ఎత్తైన ఒంటెలు, అతి పొట్టి ఒంటెలను కూడా ఆ మార్కెట్ కి తీసుకొస్తుంటారు. ఒంటెల వెంట్రుకలనుంతి తయారు చేసిన వస్త్రాలను కూడా అక్కడ ప్రదర్శిస్తుంటారు. దీనికోసం క్యామెల్ క్లబ్ ఒకటి ఉంది. దీని ఆధ్వర్యంలోనే ఈ పోటీలన్నీ జరుగుతుంటాయి. ఒంటెల ఆహారానికి సంబంధించిన కొన్ని కంపెనీలు ఇక్కడికి వస్తుంటాయి. ఒంటెల పెంపకం అనేది గల్ఫ్ దేశాల్లో వెయ్యి కోట్ల రూపాయల మార్కెట్ కలిగి ఉందంటే ఆశ్చర్యం వేయక మానదు.

     

    ఇవీ చదవండి… 

    బాబూ , బాబూ అంటూ ముద్దాడుతూ రోదిస్తున్న గౌతంరెడ్డి తల్లి

    మిస్ యూ గౌతమ్.. ఎమోషనల్ అవుతున్న బాల్య మిత్రులు..

    నా భార్య చీటర్.. ఆమె మోసాలతో నాకు సంబంధం లేదు..

    తాళి కట్టాక పెళ్లి కూతురు సినిమా చూపించింది..