ఎమ్మెల్యేలకు జగన్ టార్గెట్ 2024 ..

  0
  615

  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి టార్గెట్ 2024 రెడీ చేశారు. దీనికి అవసరమైన కార్యక్రమానికి రూపకల్పన చేశారు . మంగళవారం జరిగిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లెజిస్లేచర్ సమావేశంలో ఆయన ఎమ్మెల్యేలకు నిర్దేశించిన రూట్ మ్యాప్ ఇందుకు నిదర్శనం . రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని 2024 వరకు తన పార్టీ ఎమ్మెల్యేలకు టైం టేబుల్ ఇచ్చేశారు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఇంటింటికి తిరగాలని వారానికి రెండు సార్లు తమ పరిధిలోని ప్రతి సచివాలయాన్ని సందర్శించాలని అక్కడ ప్రజలను కలుసుకోవాలని వారితో మమేకం కావాలని వారి సమస్యలు పరిష్కరించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు .

  అంతేకాదు సంక్షేమ పథకాల అమలు తీరును కూడా సమగ్రంగా పరిశీలించి , సమీక్షించాలని కోరారు . వీటన్నింటికి తోడు ఎమ్మెల్యేలు ఇంటింటికి తిరుగుతున్నారా ..? లేదా అని నివేదికలు తెప్పించుకుంటానని చెప్పారు. దీన్నిబట్టి ఎమ్మెల్యేలు అమరావతిలోనో , లేదా మరే ఇతర ప్రాంతాల్లోనూ కాకుండా నేరుగా ప్రజల దగ్గరే ఉండాలని గ్రామాల్లో తిరగాలని , సచివాలయాన్ని సందర్శించాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఒక రూట్ మ్యాప్ ఇచ్చేశారు . రూట్ మ్యాప్ ప్రకారం పనిచేయని వాళ్ళకి ఒకటిన్నర సంవత్సరం తర్వాత జరిగిన సర్వేలో సరైన ఫలితాలు రాకపోతే వారికి టికెట్ నిరాకరించే ప్రమాదం కూడా ఉంది . ఈ విషయం స్పష్టంగా పరోక్షంగా ఆయన చెప్పేశారు.

  దీనికితోడు మంత్రివర్గ మార్పు విషయాన్ని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్పారు. మంత్రులందరినీ మారుస్తారని ప్రచారం ఉన్నప్పటికీ కొందరి విషయంలో మాత్రం దీనికి మినహాయింపు ఉంది. ఇద్దరు ముగ్గురు మంత్రులు కొనసాగే అవకాశం ఉందని భావిస్తున్నారు. కొన్ని కులాలకు సంబంధించి ఒక్కరే ,ఉన్న సందర్భాల్లో ఇది వర్తిస్తుంది. దీనికితోడు జూలై నెలలో పార్టీ ప్లీనరీ సమావేశాలను ఏర్పాటు చేశారు .

  ఈ సమావేశంలో వై ఎస్ ఆర్ సి పి మార్గదర్శక సూత్రాలను, పార్టీ ప్రణాళికను సమీక్షించే అవకాశం కూడా ఉంది . నిన్న జరిగిన వైఎస్ఆర్సిపి సీఎల్పీ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా 2024 టైం టేబుల్ ఎమ్మెల్యేలకు అందజేశారు దీని ప్రకారం పని చేయగలిగిన వారికి టికెట్లు ఉంటాయన్నది స్పష్టం. మరో రెండేళ్ల పాటు ఎమ్మెల్యేలు రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పనిచేయాల్సి ఉంటుంది . ఈ విధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి తమ పార్టీ ఎమ్మెల్యేలను ఎంపీలను ఎమ్మెల్సీలను రాబోయే ఎన్నికలకు సమాయత్తం చేయడం విశేషం..

   

  ఇవీ చదవండి… 

  అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

  నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

  చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

  సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో..