మూడు రాజధానులపై తగ్గేదేలే.. అసెంబ్లీలో జగన్.

    0
    50

    మూడు రాజధానుల అంశంపై పుష్ప స్టైల్ లో తగ్గేదే లేదంటున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్. పరిపాలనా వికేంద్రీకరణకే తన ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. మూడు రాజధానుల అంశంపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో అసెంబ్లీలో సుదీర్ఘ ప్రసంగంలో మూడు రాజధానుల ప్రస్తావన ప్రధానమైంది. రాజ్యాంగం ప్రకారం, మూడు వ్యవస్థలు, అంటే న్యాయ, శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలు ఎవరి పరిధిలో వారు పనిచేస్తేనే గౌరవంగా ఉంటుందని, ప్రజాస్వామ్యం బతుకుతుందని, లేదంటే వ్యవస్థలన్నీ కుప్పకూలిపోతాయని చెప్పారు.

    తాము ఈ సూత్రాన్ని పూర్తిగా నమ్ముతున్నామని అన్నారు. ప్రజాభిప్రాయం ప్రకారమే ప్రభుత్వాలు చట్టాలు చేస్తాయని చెప్పారు. గతంలో అసలు చట్టాన్నే వెనక్కు తీసుకున్నప్పుడు మళ్లీ ఆ చట్టంపై తీర్పు ఏంటని నిలదీశారు. చట్టాలు చేసే అధికారం శాసన వ్యవస్థకు ఉండదా అని ప్రశ్నించారు. నెల రోజుల్లో ఇన్ని కోట్లు ఖర్చు చేయండి అని కోర్టు చెప్పడం శాసన వ్యవస్థలోకి జోక్యం చేసుకోవడమేనని అన్నారు. అధికార వికేంద్రీకరణకే ముమ్మాటికీ కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.

    న్యాయ వ్యవస్థ, శాసన వ్యవస్థ నిర్ణయాలను ప్రశ్నించలేదని, కొన్ని పరిస్థితుల్లో న్యాయ వ్యవస్థ కూడా హద్దుమీరి ప్రవర్తిస్తోందనే అభిప్రాయం కలుగుతోందన్నారు. హైకోర్టు తీర్పు ఫెడరల్ వ్యవస్థ స్ఫూర్తికే హానికరం అని అన్నారు. రాజధాని నిర్ణయంలో కేంద్రం పాత్ర కూడా ఉండదని స్పష్టం చేశారు. గతంలో టీడీపీ ఎంపీ కేశినేని నాని అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వకంగానే తమ ప్రమేయం లేదని స్పష్టం చేసిందని జగన్ అన్నారు.

    ఇవీ చదవండి… 

    అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

    నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

    చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

    సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో..