కన్నీరు తెప్పిస్తున్న యోగి సోదరి ఒకే ఒక కోరిక..

  0
  362

  ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాధ్ సోద‌రి చేసిన ఓ విజ్ఞ‌ప్తి అంద‌రినీ క‌దిలించి వేస్తోంది. ప్ర‌స్తుతం ఓ పూడి గుడిసెలో టీ అమ్ముకుంటున్న సోద‌రి శ‌శీసింగ్.. బుధ‌వారం నాడు ఒక‌సారి త‌న సోద‌రుడు వ‌చ్చి త‌ల్లిని చూసి పోవాల‌ని కోరింది.

  త‌న ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వానికి సోనియాగాంధీ మొద‌లు ప్ర‌ధాని మోడీ వ‌ర‌కు అంద‌రినీ పిలిచిన యోగి… త‌ల్లిని మాత్రం పిల‌వ‌లేదు. రెండ‌వ‌సారి ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌నున్న యోగి.. 18 ఏళ్ళ వ‌య‌సులో ఇల్లు వ‌దిలిపోయాడు. ఆయ‌న సోద‌రి టీ అమ్ముకుంటోంద‌ని ఇటీవ‌ల టీవీలో వ‌చ్చిన క‌ధ‌నం చూసే వ‌ర‌కు ఎవ‌రికీ తెలియ‌దు.

  18 ఏళ్ళ క్రితం వ‌ర‌కు యోగీ అస‌లు పేరు అజ‌య్ సింగ్ బిష్త్. గోర‌ఖ్ పూర్ లోని మ‌ఠంలో చేరిన త‌ర్వాత .. ఆయ‌న త‌న పేరును యోగి ఆదిత్య‌నాధ్ గా మార్చుకున్నారు. అప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు త‌ల్లిని కూడా చూడ‌లేదు. ఆయ‌న సోద‌రి శ‌శీసింగ్.. త‌మ‌కు రాజ‌కీయాల‌తో ఎలాంటి సంబంధం లేద‌ని, ఎవ‌రి బ‌తుకు వారు బతుకుతున్నామ‌ని, సీఎం అయినంత మాత్రాన ఆయ‌న వ‌ద్ద‌కు తాము వెళ్ళ‌బోమ‌ని అన్నారు. అయితే ఒక్క‌సారి త‌ల్లిని చూడాల్సిందిగా ఆమె కోరింది. అదే ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ ప్ర‌మాణ‌స్వీకారం ముందుగానీ, త‌ర్వాత‌గానీ త‌ల్లి వ‌ద్ద‌కు వెళ్ళి ఆశీర్వాదం తీసుకునేవార‌ని చెప్పింది.

   

  ఇవీ చదవండి… 

  అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

  నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

  చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

  సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో..