అతితెలివితో పోలీసులనే ఫూల్ చేయాలనుకున్నాడు ఓ టీనేజర్. కానీ ఖాకీలు ఇచ్చిన రివర్స్ పంచ్ కి, ఖంగుతిని.. చివరికి కటకటాల వెనక్కి వెళ్ళాడు. బ్రిటన్ లోని నాటింగ్ హాంషైర్ ప్రాంతంలో ఓ టీనేజర్ రోడ్డులో యాక్సిడెంట్ కి గురయ్యాడు. వెంటనే అతని ఫోన్ నుంచి ఎస్.ఒ.ఎస్ వెళ్ళింది. ఆ రోడ్డునే వెళుతున్న కొందరు దిగి.. వారు కూడా పోలీసులకు, అంబులెన్స్ లకు ప్రమాదం గురించి సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు, అంబులెన్స్, ఫైర్ సిబ్బంది… ఓ టీనేజర్ పరిస్థితిని గమనించారు. బైక్ అతనిపై పడి ఉంది. వెంటనే అతనిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. తనకు కుడి చేయి, కుడి కాలు పని చేయడం లేదని, అవి తన స్వాధీనంలో లేవని చెప్పుకొచ్చాడు.
అయితే పోలీసులకు టీనేజర్ వ్యవహారంపై అనుమానం రావడంతో యాక్సిడెంట్ జరిగిన ప్రాంతంలో ఉన్న సీసీ పుటేజీని పరిశీలించారు. అందులో ఉన్న దృశ్యాన్ని చూసి అవాక్కయ్యారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే… నిజానికి ఆ టీనేజర్ యాక్సిడెంట్ కి గురి కాలేదు. యాక్సిడెంట్ అయినట్లు క్రియేట్ చేశాడు. బైక్ ని తన మీద కావాలనే పడవేసుకుని ప్రమాదానికి గురైనట్లు నటించాడు. ఇదంతా చూసిన పోలీసులు… అతడి తిక్క కుదర్చాలని… ఈ సీసీ పుటేజీని టీడీ చానల్స్, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ టీనేజర్ భయపడి… తన తప్పును ఒప్పుకున్నాడు. వెంటనే అతన్ని హాస్పిటల్ నుంచి డిశ్చార్చి చేయించి, అరెస్టు చేశారు.