20 ఏళ్ళ రేపిస్ట్ ని ఎన్ కౌంటర్ చేశారు..

  0
  924

  16 ఏళ్ల బాలికపై అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి ఆ బాలికను పదేపదే బ్లాక్మెయిల్ చేస్తూ అత్యాచారానికి ఒడిగట్టిన 20 ఏళ్ల యువకుడిని పోలీసులు ఎన్కౌంటర్లో కాల్చి చంపేశారు. బిక్కి ఆలీ అనే 20 ఏళ్ల యువకుడు, తన స్నేహితురాలైన 16 ఏళ్ల బాలికను మాట్లాడుకుందాం అని పిలిచి స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారం చేశాడు. ఈ మొత్తం వ్యవహారాన్ని వీడియో కూడా తీశాడు. ఆ తర్వాత ఈ వీడియోను బయటపెడతానని ఆ బాలికను బెదిరించి హోటల్స్ కు తీసుకు పోవడం మొదలుపెట్టాడు.

  హోటల్ కి వస్తే వీడియో తీసేస్తానని ఆశ చూపించి మళ్లీ అక్కడ కూడా నలుగురు యువకులు చేత సామూహిక అత్యాచారం చేయించి దానిని కూడా వీడియో తీసాడు. ఇదే విధంగా ఆ బాలికను రెండు దఫాలు పిలిపించి ఈ దారుణానికి పాల్పడ్డాడు. యువకులు పదేపదే ఆ యువతికి ఈ సామూహిక అత్యాచారం వీడియో చూపించి మళ్ళీ హోటల్ కి తీసుకెళ్లి అదేవిధంగా అత్యాచారం చేస్తూ వీడియో తీసి ఉండడంతో అది భరించలేని ఆ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.

  పోలీసులు జరిపిన విచారణలో బిక్కి ఆలీ, హైదర్ ఆలీ , ఆలీ. పింకుఆలి ఈ సామూహిక అత్యాచారం లో పాల్గొన్నారు . పోలీసులు అరెస్ట్ చేసి కేసు విచారణ చేస్తున్నారు . ఈ సందర్భంగా నేరం జరిగిన ప్రాంతానికి తీసుకుపోతుండగా విక్కీ ఆలీ మహిళా సబ్ ఇన్స్పెక్టర్ వద్ద నుంచి రివాల్వర్ లాక్కుని ఆమె పై కాల్పులు జరిపేందుకు ప్రయత్నాలు చేశాడు. దీంతో పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో అక్కడికక్కడే చనిపోయాడు.

  ఇవీ చదవండి… 

  అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

  నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

  చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

  సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో..