నన్ను కాల్చొద్దు .. లొంగిపోతున్నా..

  0
  86

  ఉత్తరప్రదేశ్ లో యోగి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో గూండాలకు , మాఫియాలకు మళ్లీ గుండెల్లో భయం మొదలైంది. ఒక కిడ్నాప్ కేసులో నిందితుడిగా ఉన్న గౌతమ్ అనే వ్యక్తి గొండ జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు.. విచిత్రమేమిటంటే లొంగిపోయే ముందు మెడలో ఒక బోర్డు వేసుకొని నేను లొంగి పోతున్నాను.. నన్ను కాల్చొద్దు అంటూ కేకలు పెడుతూ ఆ బోర్డు అందరికీ చూపిస్తూ పోలీస్ స్టేషన్ లోకి వెళ్లి కూర్చుండిపోయాడు. గౌతమ్ సోదరుడు అనిల్ తో , కలిసి మరో ముగ్గురితో చికెన్ వ్యాపారం చేసుకునే ఓ వ్యక్తిని కిడ్నాప్ చేశాడు . అతన్ని వదిలి పెట్టాలి అంటే 20 లక్షల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశాడు.

  తనతో కారులో తీసుకెళ్ళి దాచేశాడు. అయితే గౌతమ్ సహచరులను పట్టుకున్న పోలీసులు గౌతమ్ ని కనుక్కొని ఆ వ్యాపారిని రక్షించారు . గౌతమ్ అనుచరులు ముగ్గురిని అరెస్టు చేశారు . అప్పటి నుంచి గౌతమ్ పరారీలో ఉన్నాడు . ఆచూకీ తెలిపిన 25వేల రూపాయలు బహుమతి ఇస్తామని పోలీసులు ప్రకటించారు . ఈ మేరకు జిల్లా మొత్తం వాల్ పోస్టులు కూడా వేశారు. సోషల్ మీడియాలో కూడా ప్రచారం చేశారు.

  ఇక తనకు చావు తప్పదని ఏ విధంగానైనా సరే పోలీసులు ఎన్ కౌంటర్ చేసేస్తానని భయపడ్డ గౌతమ్ ఈరోజు ఉదయం మెడలో ఒక బోర్డు వేసుకుని నేను లొంగిపోతున్నా నన్ను ఎన్ కౌంటర్ చెయ్యొద్దు అంటూ కేకలు పెడుతూ పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళి కూర్చుండిపోయాడు. పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు ఉత్తరప్రదేశ్లో గతంలో కూడా ఎన్ కౌంటర్ కి , భయపడి అనేక మంది పోలీస్ స్టేషన్లో ఇదేవిధంగా లొంగిపోయే వారు . ఇప్పుడు గౌతమ్ కూడా అదే కోవలోకి వచ్చేశాడు . యోగి ప్రభుత్వం ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విధంగా లొంగిపోయిన గౌతమి మొదటివాడు.

  ఇవీ చదవండి… 

  అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

  నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

  చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

  సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో..