కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిందన్నది సామెత, 40 పైసల కోసం కోర్టుకి పోయిన ఓ పెద్దాయన 4000 ఫైన్ కట్టాల్సివచ్చింది. బెంగళూరులో మూర్తి అని ఓ పెద్దాయనకి ,ఒక లెక్కుంది , అయితే ఆ లెక్కకి ఒక తిక్క ఉంది.. మూర్తి అనే ఈ పెద్దాయన హోటల్ కి వెళ్ళాడు ఆ హోటల్లో బిల్లు 264 రూపాయలు 60 పైసలు అయింది అయితే బిల్లింగ్ లో దాన్ని 265 రూపాయలు రౌండప్ చేశాడు చేసి కట్టమన్నారు.
40 పైసలు ఎక్కువ ఎందుకు కట్టాలని మూర్తి వారితో వాగ్వాదానికి దిగాడు . అది టాక్స్ మొత్తం అని , టాక్స్ సంబంధించి రౌండ్ ఫిగర్ చేయవచ్చునని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలున్నాయని హోటల్ వాళ్ళు చెప్పారు. అయినా వారి మాటలను వినలేదు , తగాదా వేసుకొని , చివరకు 265 రూపాయలు బిల్లు కట్టేసి వచ్చేసాడు. దీంతో ఆ బిల్లు తీసుకుని తన వద్ద 40 పైసలు ఎక్కువ వసూలు చేశారని కేసుపెట్టాడు.
కేసు విచారించిన న్యాయమూర్తులు మూర్తిని తీవ్రంగా మందలించి 4000 రూపాయలు ఫైన్ కట్టమని ఆదేశించారు. ఇందులో 2000 రూపాయలు హోటల్ కి , 2000 రూపాయలు కోర్టు ఖర్చులకు జమ చేసుకోవాలని కోర్టు స్పష్టం చేసింది వ్యక్తిగత ప్రచారం కోసం ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలు తమ వద్దకు తీసుకు రావద్దని కూడా హెచ్చరించింది. చౌకబారు ప్రచారంకోసం ఇలా కోర్టు సమయాన్ని వృధాచేయ్యొద్దని మందలించారు..