హిజ్రాను ప్రేమించి పెళ్లి చేసుకొని ఉరేసుకున్నాడు.

    0
    39164

    హిజ్రాను ప్రేమించానని, ఆమెనే పెళ్లి చేసుకుంటానని ఇంట్లో చెప్పాడు ఓ యువకుడు. పెద్దలు ఒప్పుకోలేదు, కుదరదన్నారు. కానీ వారిని ఒప్పించి చివరకు పెళ్లి చేసుకున్నాడు. అయితే రెండేళ్లకే అతని ప్రాణాలు పోయాయి. హిజ్రాను పెళ్లిచేసుకున్న ఓ యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన విజయవాడ అజిత్‌ సింగ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని న్యూరాజరాజేశ్వరీపేటలో జరిగింది. న్యూఆర్‌ఆర్‌ పేటకు చెందిన వడ్డీ రమదేవి, రామారావు దంపతుల కొడుకు ప్రవీణ్‌కుమార్‌ (26) రెండేళ్ల క్రితం మాధవి అనే హిజ్రాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

    అప్పటి నుంచి తల్లిదండ్రుల పక్కనే ఇల్లు అద్దెకు తీసుకొని కాపురం ఉంటున్నారు. వారిద్దరి మధ్య గొడవలు వచ్చినప్పటికీ మళ్లీ సర్దుకొని జీవిస్తున్నారు. తల్లిదండ్రులిద్దరూ హైదరాబాద్‌లో తమ బంధువుల ఇంట్లో వేడుక ఉంటే వెళ్లగా హిజ్రా మాధవి అత్తమామలకు ఫోన్ చేసింది. మీ కొడుకు ఉరేసుకొని చనిపొయాడని చెప్పింది. దీంతో వారు హూటాహూటిన విజయవాడ చేరుకొని తమ కుమారుడి భౌతికకాయాన్ని చూసి కుమిలిపోయారు. తమ కొడుకు మరణంపై అనుమానాలు ఉన్నాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

    ఇవీ చదవండి

    పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

    ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

    పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

    తిరుమల నామాల పార్కులో కోడె నాగు.