ప్రకృతి ఎన్నో అద్భుతాలకు, రహస్యాలకు నెలవు. సాధారణంగా దేశంలో చిరుతపులులు రంగుకి భిన్నంగా పింక్ రంగులో ఉన్న ఓ చిరుతపులి మన దేశంలోని అడవుల్లో కనిపించింది. రాజస్థాన్ రాష్ట్రం పాళీ జిల్లా రణక్ పూర్ అభయారణ్యంలో ఓ ఆడ చిరుత పింక్ రంగులో దర్శనమిచ్చింది. ఇంతవరకు ఇలాంటి చిరుతపులిని ఒక్కసారి దక్షిణాఫ్రికా అడవుల్లోనే కనిపించింది. ఇప్పుడు రాజస్థాన్ లో కనిపించిన చిరుత రెండవది. దాని చర్మం మీద మచ్చలు కూడా స్ట్రాబెర్రీ పండును పోలిన విధంగా ఉంది.
రాజస్థాన్ అడవుల్లో పింక్ రంగులో ఉన్న చిరుతను చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న జంతు శాస్త్రవేత్తలు మన దేశానికి ప్రయత్నించారు. అయితే ఇక్కడి ఫారెస్ట్ అధికారులు మాత్రం అనుమతి నిరాకరించారు. చిరుతపై అధ్యయనం చేసేందుకు ఫోటోలు, వీడియోల పేరుతో సంచరిస్తే, అడవుల్లో ఇతర జంతువులకు ఇబ్బందులు కలుగుతాయనే ఉద్దేశ్యంతో అనుమతి నిరాకరించినట్లు అధికారులు తెలిపారు. అయితే జన్యుపరమైన కారణాల వల్లే చిరుత పింక్ రంగులో ఉండవచ్చునని శాస్త్రవేత్తలు అంటున్నారు. చిరుత ఈ రంగులో ఉండడానికి గల కారణాల గురించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.