చెన్నైలోని సర్వశక్తి పీఠం పేరుతొ , తాను దైవదూతనని చెప్పుకుంటూ దారుణానికి పాల్పడ్డ సత్యనారాయణ అనే దొంగ స్వామిని , అయన భార్య పుష్పలతను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక మైనర్ యువతిని రేప్ చేసి బ్లాక్ మెయిల్ చేసిన కేసులో ఇద్దరినీ అరెస్ట్ చేశారు. భర్త రేప్ చేస్తుంటే , భార్య పుష్పలత వీడియో తీసేది. ఆ ఆతరువాత బెదిరించి బ్లాక్ మెయిల్ కి పాల్పడేవాళ్లు. ప్రస్తుతం అరెస్ట్ అయినా కేసులో , ఫిర్యాదు చేసిన బాలికను మూడేళ్ళుగా రేప్ చేస్తున్నాడు. మూడేళ్ళ క్రితం ఈ బాలికను తండ్రి ఆశ్రమానికి తీసుకొచ్చాడు. బాలికను , పాపగ్రహాలు పూనాయని , అందువల్ల కొన్ని రోజులు ఆశ్రమంలోనే ఉంచితే పూజలు చేస్తానని చెప్పాడు. రేపిస్ట్ స్వామి మాటలు నమ్మిన , తండ్రి అమ్మాయిని ఆశ్రమంలో వదిలి పోయాడు.
ఆ సమయంలో బాలికకు , పుష్పలత మత్తుమందు కలిపినా పళ్లరసం ఇచ్చింది. రాత్రి భర్తచేత రేప్ చేయించింది. దీన్ని వీడియో తీసింది. తరువాత బాలికను బెదిరించి తరచూ అత్యాచారం చేసేవాడు. బాలికకు ఏడాది క్రితం పెళ్లయింది. కొన్ని రోజుల తరువాత భర్త ఉద్యోగం నిమిత్తం దుబాయికి వెళ్ళాడు . మళ్ళీ రేపిస్ట్ స్వామి అమ్మాయికి ఫోన్ చేసి , తన దగ్గరకు రాకపోతే , ఫొటోలు బయటపెడతానని బెదిరించాడు. ఆమెను తరచుగా ఆశ్రమానికి రమ్మని అత్యాచారం చేస్తుందటటంతో , గర్భవతి అయింది. భర్త లేకుండా గర్భం ఎలావచ్చిందని ఆరా తీస్తే , ఆమె జరిగిన విషయం చెప్పేసింది. దీంతో పోలీసులు ఆశ్రమంపై దాడి చేసి , రేపిస్ట్ స్వామి నుంచి లైంగికవేధింపుల వీడియోలు , ఫొటోలు స్వాధీనం చేసుకున్నారు. స్వామిని , అతడి భార్యను జైలుకు పంపారు.