’క్షణికావేశంలో, భార్యాభర్తల చివరిమాటలు..

    0
    34

    ఆత్మకూరు పట్టణానికి సమీపంలో దారుణం జరిగింది. ప్రైవేట్ స్కూల్ యజమానులైన భార్యా భర్తలు సుబ్రహ్మణ్యం, రోహిణి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కరోనా కష్టకాలంలో స్కూల్ ఫీజులు వసూలు కాక, బయట తెచ్చిన అప్పులు తిరిగి తీర్చలేక వారు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కర్నూలు జిల్లా ఆత్మకూరు నుంచి కోయిలకుంట్లకు వెళ్లే దారిలో కారులోనే వీరు విష గుళికలు మింగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.

    కోయిలకుంట్లకు చెందిన రిటైర్డ్ హెడ్మాస్టర్ కర్నాటి రాధాకృష్ణమూర్తి కుమారుడు సుబ్రహ్మణ్యం (33) తండ్రి బాటలోనే ఉపాధ్యాయ వృత్తిలో ఉండాలనుకున్నారు. ప్రైవేట్ స్కూల్ స్థాపించారు. భార్య రోహిణి కూడా ఆయనకు చేదోడు వాదోడుగా ఉండేవారు. భార్యాభర్తలిద్దరూ గత నాలుగేళ్లుగా పట్టణంలో లైఫ్‌ ఎనర్జీ స్కూల్‌ నిర్వహిస్తున్నారు. ఆదివారం సాయంత్రం ఆత్మకూరు మండలం కరివెన సమీపంలో కారులో సుబ్రహ్మణ్యం, రోహిణి విష గుళికలు మింగి ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్‌ చేయడంతో విషయం వెలుగుచూసింది.

    ‘ఈ రోజు నేనూ.. నా భార్య చనిపోతున్నాం. అందరూ క్షమించాలి. విద్యార్థుల టీసీలు ఎంఈవో ఆఫీస్‌లో కలెక్ట్‌ చేసుకోండి. మాకు ఫీజులు రాక, అప్పులిచ్చిన వారు ఒత్తిడి చేయడంతో అవమానం భరించలేక ఇలా చేసుకోవాల్సి వస్తోంది.’ అంటూ వారు వీడియోలో మెసేజ్ పెట్టారు. స్కూల్‌ కోసం సుమారు రూ.2 కోట్ల వరకు అప్పుచేసి ఉంటారని స్థానికులు తెలిపారు.

    ఇవీ చదవండి..

    ఊపిరి తిత్తులు చెప్పే వాక్సిన్ అసలు రహస్యం..

    బ్లూటూత్ పేల‌డం ఎప్పుడైనా విన్నారా ?

    ఒలింపిక్ విజేత మీరాబాయి కన్నీళ్లతోఇలా..

    శ్రీదేవి రెండో కుమార్తె ఖుషీ కపూర్ అక్క జాన్వీకి పోటీ వస్తోంది..