చావనైనా చస్తాం.. ఆఫ్ఘనిస్తాన్ లో ఉండలేం..

    0
    73

    ఆఫ్ఘన్ రాజధాని కాబూల్ ని తాలిబన్లు వశపరచుకోవడంతో కనీవినీ ఎరుగని రీతిలో అక్కడ తీవ్ర సంక్షోభం నెలకొంది. తాలిబన్లకు భయపడి, ఎవరికివారు విదేశాలకు పారిపోవాలని టికెట్లు, వీసాలు లేకపోయినా విమానాలు ఎక్కేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతానికి కాబూల్ ఎయిర్ పోర్ట్ అమెరికా సేనల అధీనంలో ఉంది. అయితే అక్కడ రద్దీని నియంత్రించలేక అమెరికా సేనలు తలలు పట్టుకుంటున్నాయి. విమానాలు వస్తే, పాస్ పోర్ట్, వీసా లేకుండానే స్థానికులు దాని చుట్టూ గుమిగూడుతున్నారు. విమానాలు టేకాఫ్ కాకుండా అడ్డుపడుతున్నారు. చక్రాల వద్ద కూర్చుని సైతం ప్రయాణించడానికి సాహసిస్తున్నారు. ఈ క్రమంలో అమెరికా సేనలు ఈ గందరగోళాన్ని నివారించేందుకు తుపాకీకి పనిచెప్పాల్సి వస్తోంది. అమెరికా సైన్యం తుపాకీ గుండ్లకు ఇద్దరు చనిపోయారు. మరో వ్యక్తిపై అమెరికా సైనికులు తుపాకి గూరిపెట్టినప్పటి దృశ్యం ఇది.

    ఇవీ చదవండి..

    ఊపిరి తిత్తులు చెప్పే వాక్సిన్ అసలు రహస్యం..

    బ్లూటూత్ పేల‌డం ఎప్పుడైనా విన్నారా ?

    ఒలింపిక్ విజేత మీరాబాయి కన్నీళ్లతోఇలా..

    శ్రీదేవి రెండో కుమార్తె ఖుషీ కపూర్ అక్క జాన్వీకి పోటీ వస్తోంది..