ఇప్పుడు దేశంలో ఎల్లో ఫంగస్ భయం..

    0
    48

    కరోనా రెండో దశ విలయంలో బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ వ్యాధులు ఆందోళన కలిగిస్తుండగా.. ఇప్పుడు కొత్తగా ఎల్లో ఫంగస్ వెలుగులోకి వచ్చింది. ఇది బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ కంటే ప్రమాదకరమైందని డాక్టర్లు తేల్చారు. ఈ ఎల్లో ఫంగస్ మొట్టమొదటి సారిగా, ఉత్తర ప్రదేశ్ లోని ఘజియా బాద్ లో వెలుగు చూసింది. ఘజియా బాద్ లోని ఈఎన్టీ డాక్టర్ బీపీ త్యాగి ఆస్పత్రిలో ఈ ఎల్లో ఫంగస్ ని గుర్తించారు. 45ఏళ్ల ఒక పేషెంట్, సైనస్ వ్యాధిలాగా కనపడే సీటీ స్కాన్ తో వచ్చాడని, చికిత్స తర్వాత ఎంతకీ తగ్గకపోవడంతో ఎండోస్కోపీ ద్వారా పరీక్షించామని, పరీక్షకు పంపితే, ల్యాబ్ నివేదికల ప్రకారం అతనిలో బ్లాక్, వైట్, ఎల్లో ఫంగస్ లు ఉన్నట్టు కనుగొన్నామని అన్నారు. ఎల్లో ఫంగస్ సాధారణంగా పాము జాతికి చెందిన వాటిల్లో కనిపిస్తుందని అన్నారు. ఈ ఎల్లో ఫంగస్ కొవిడ్ వ్యాధి నుంచి కోలుకున్న వారిలో ఎక్కువగా కనిపిస్తుందని, రెండు నెలలపాటు కొవిడ్ వ్యాధిబారిన పడి, మందులు వాడిన వారిలో దీన్ని గుర్తించామని అన్నారు. ఇతనికి ప్రస్తుతం వైద్య చికిత్స జరుగుతోందని తెలిపారు.

    ఇవీ చదవండి..

    ఏపీని చుట్టుముడుతున్న బ్లాక్ ఫంగస్…

    వాళ్ల శృంగారానికి పక్కింటోళ్ల గోల..

    కరోనాకి కొత్త లక్షణం.. ఓసారి పరీక్షించుకోండి..

    రఘురామకృష్ణంరాజు.. ఆమె చేతిలో పడ్డాడు