‘యాస్’ తుపాను… 24 గంటల్లో అతి తీవ్ర తుపానుగా..

  0
  3948

  తూర్పు, మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ‘యాస్’ తుపాను… 24 గంటల్లో అతి తీవ్ర తుపానుగా మారనుంది. ఇది అండ‌మాన్ దీవులుకు ఉత్త‌రాన వాయువ్య దిశ‌లో 620 కి.మీ, ఒడిశా రాష్ట్రంలోని పారాదీప్ కి 530 కి.మీ, బాలసోర్ (ఒడిశా) కి ఆగ్నేయంగా 630 కి.మీ, దిఘా (పశ్చిమ బెంగాల్) కి ఆగ్నేయంగా 620 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైంది. ఉత్తర ఒడిశా – పశ్చిమ బెంగాల్ పారాదీప్ మరియు సాగర్ ద్వీపాల మధ్య మే 26 మధ్యాహ్నం తీరం దాటే అవకాశమున్న‌ట్లు తెలుస్తోంది.

   

  తుపాను తీరం దాటే సమయంలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. సముద్ర అలలు 2.9 మీటర్ల నుంచి 4.5 మీటర్ల ఎత్తు వరకు ఎగసిపడతాయని పేర్కొంది. ఉత్తరాంధ్రలో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. నెల్లూరు నుంచి ఉత్తరాంధ్ర తీరం వరకు సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, తీర ప్రాంత ప్ర‌జ‌లు, లోతట్టువాసులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరించింది.

  ఇవీ చదవండి..

  ఏపీని చుట్టుముడుతున్న బ్లాక్ ఫంగస్…

  వాళ్ల శృంగారానికి పక్కింటోళ్ల గోల..

  కరోనాకి కొత్త లక్షణం.. ఓసారి పరీక్షించుకోండి..

  రఘురామకృష్ణంరాజు.. ఆమె చేతిలో పడ్డాడు