మూడో వైసీఎల్పీలో జగన్ నోట కొత్త మంత్రుల మాట..

    0
    688

    ఈరోజు సాయంత్రం జరిగే వైఎస్సార్సీపీ లేజిస్లేటివ్ పార్టీ సమావేసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడో లేజిస్లేటివ్ పార్టీ మీటింగ్ ఇది. మొదటి సారి ఎన్నికలైన తర్వాత లేజిస్లేటివ్ పార్టీ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకునేందుకు వైసీపీఎల్పీ సమావేశం ఆ తర్వాత, కేబినెట్ ఏర్పాటుకి ముందు మరోసారి జరిగింది. రెండో దఫా ఏర్పాటైన వైసీఎల్పీ సమావేశంలో ఆనాడు ఏర్పాటు చేయబోతున్నా మంత్రి వర్గం గురించి చెప్పి, రెండున్నరేళ్లు మాత్రమే ఈ టీమ్ ఉంటుందని, రెండున్నరేళ్ల తర్వాత కొత్త టీమ్ వస్తుందని చెప్పారు. ఇప్పుడు మళ్లీ సీఎల్పీ సమావేశం పెట్టారు. దాదాపు 2 సంవత్సరాల 10 నెలల్లో ఇది మూడో సమావేశం.

    ఈ సమావేశంలో మంత్రివర్గ విస్తరణ గురించి చెప్పబోతారని భావిస్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా రెండో దఫా వేసీఎల్పీ సమావేశంలో మంత్రి వర్గ ఏర్పాటు గురించి చెప్పి, పదవులు రానివారంతా సమర్థులు కాదని అర్థం కాదని, ఉన్న సమీకరణాల దృష్ట్యా, పరిస్థితుల దృష్ట్యా కొన్ని సర్దుబాట్లు చేయాల్సి వస్తుందని అప్పుడు చెప్పారు. మంత్రి పదవులు రానివారు నిరాశ పడొద్దన్న ఉద్దేశమే ఆనాటి వైసీఎల్పీ సమావేశం అజెండా. అలాంటిది ఇప్పుడు కూడా కొత్త మంత్రివర్గ ఏర్పాటుకి ముందు సమావేశం పెట్టి, మాజీలు కాబోతున్నవారిని, కొత్తగా మంత్రులు కాలేని వారిని బుజ్జగించే ప్రయత్నం చేస్తారని తెలుస్తోంది. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో కొత్త మంత్రి వర్గ ఏర్పాటుపై ముఖ్యమంత్రి, మంత్రులతోనే చర్చించి ఆ విషయాన్ని మీడియాకు కూడా లీక్ చేశారు. సాక్షి పత్రికలో కూడా ఈ విషయం స్పష్టంగా పేర్కొన్నారు. అంటే ప్రస్తుత మంత్రివర్గ స్థానంలో కొత్త మంత్రి వర్గం ఏర్పాటుకి ముఖ్యమంత్రి సిద్ధమైపోయారనే వార్త అధికారికంగానే చెప్పక చెప్పినట్టయింది. దానిలో భాగంగా ఈ రోజు సాయంత్రం జరిగే వైసీఎల్పీ సమావేశంలో తన ఆలోచనలను స్పష్టంగానే చెప్పబోతున్నారని భావిస్తున్నారు.

    ఇవీ చదవండి… 

    అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

    నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

    చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

    సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో..