డేంజర్ బెల్స్: చైనాలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు..

    0
    810

    చైనాలో మరోసారి డేంజర్ బెల్స్ మోగాయి. భారత్ లో థర్డ్ వేవ్ తగ్గిపోతోందని జనం సంతోషంగా ఉంటే.. అటు చైనాలో మాత్రం కరోనా కుమ్మేస్తోంది. కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. వారం రోజులుగా జనం అల్లాడిపోతున్నారు. ఎక్కడికక్కడ ప్రభుత్వం లాక్ డౌన్ విధిస్తోంది. మరోవైపు మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటోంది. గతంలో చైనాలో కరోనా బయటపడినప్పుడు వుహాన్ లో రోజుల వ్యవధిలోనే భారీ ఆస్పత్రి నిర్మించారు. తాజాగా అదే స్పీడ్ తో మరో పెద్ద ఆస్పత్రి నిర్మించారు. 6 రోజుల్లోనే 60వేల బెడ్స్ ఉండే ఆస్పత్రిని రెడీ చేస్తున్నారు.

    చైనాలోని జిలిన్ ప్రావిన్స్ లో ఈ ఆస్పత్రి రెడీ అవుతోంది. జిలిన్ ప్రావిన్స్‌లోనే రోజుకు వెయ్యికి పైగా కేసులు నమోదవుతున్నాయి. చైనా వ్యాప్తంగా ఆదివారం 3400 కేసులు నమోదుకాగా.. సోమ‌వారం 2300 బయటపడ్డాయి. దీంతో ప‌లు ప్రాంతాల‌ను కోవిడ్ 19 హాట్‌ స్పాట్స్‌ గా గుర్తించారు. లాక్ డౌన్ ను అమ‌లు చేస్తున్నారు. చైనాలోని ప్ర‌ధాన ప‌ట్ట‌ణం షాంగైలోనూ క‌ఠిన ఆంక్ష‌లు అమ‌లులో ఉన్నాయి. స్కూల్స్, రెస్టారెంట్స్‌, షాపింగ్ మాల్స్ అన్నింటిని తాత్కాలికంగా మూత‌ప‌డ్డాయి.

    ముఖ్యంగా ఈశాన్య చైనాలో కొవిడ్ వ్యాప్తి మరింత ఎక్కవగా ఉంది. జిలిన్ ప్రావిన్స్‌ లోని సిపింగ్, డన్‌ హువా నగరాల్లో భారీ సంఖ్య‌లో కేసులు న‌మోదు కావ‌డంతో యుద్ద ప్ర‌తిపాదిక‌న 6 వేల పడకల గల ఆసుపత్రిని నిర్మించబోతున్నారు. తాత్కాలికా ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించిన వీడియోని చైనా స్ధానిక మీడియా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది.

    ఇవీ చదవండి… 

    అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

    నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

    చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

    సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో..