ఐదు రోజుల తరువాత అక్కడ డీజిల్ , పెట్రోల్ ఖాళీ..

  0
  90

  పెట్రోలియం ఉత్పత్తి చేసే దేశాలు తప్ప మిగతా దేశాలలో పెట్రోల్ డీజిల్ కొరత తీవ్రంగానే ఉందా ..? అవుననే చెబుతున్నారు అంతర్జాతీయ చమురు సంస్థల నిపుణులు .. రష్యా , ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత పరిస్థితి మరింత దిగజారింది. ఇప్పుడు పాకిస్తాన్లో మరో ఐదు రోజులకు సరిపడా మాత్రమే డీజిల్ , పెట్రోల్ నిలువలు ఉండే పరిస్థితి దాపురించింది . గతంలో ఎన్నడూ లేనంతగా ఇప్పుడు పాకిస్తాన్ ఆయిల్ కొరతను ఎదుర్కోబోతుంది. డిసెంబర్ నుంచే , రష్యా , ఉక్రెయిన్ యుద్ధంపై హెచ్చరికలు ఉన్నా , పాకిస్తాన్ ముందుజాగ్రత్తగా ఆయిల్ నిలువలు పెట్టుకోలేదు.

  గతంలో కూడా ఈ విషయంలో ఆయిల్ కంపెనీల సలహామండలి పాకిస్థాన్ను ఈ హెచ్చరించింది. అయినా పెడచెవిన పెట్టడంతో ఇప్పుడు ప్రమాదం ముంచుకొచ్చింది. : పాకిస్థాన్లో ఆయిల్ కంపెనీలకు బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడం, ప్రభుత్వం కూడా వారికి ఆర్థిక సహాయం చేయకపోవడంతో ఆయిల్ కంపెనీలు కూడా చమురు దిగుమతుల విషయంలో నిరాసక్తత వ్యక్తం చేశాయి ప్రభుత్వ రంగ ఆయిల్ సంస్థ కూడా ఈ విషయంలో చూస్తూ ఉండిపోయింది .

  దీంతో పాకిస్తాన్ లో మరో ఐదు రోజుల తర్వాత డీజిల్ పెట్రోల్ అనే పరిస్థితి ఏర్పడింది. పాకిస్తాన్లో పెట్రోలు డీజిల్ ధరలు మరో ఐదు రోజుల్లో ఖాళీ కావడంతో పాకిస్థాన్లో ఆందోళన మొదలైంది . దీంతో దేశంలో పారిశ్రామిక ఉత్పత్తి మందగించే ప్రమాదం ఉంది . ఆర్థిక మాంద్యం తలెత్తే అవకాశం ఉంది . దేశవ్యాప్తంగా రవాణా రంగం స్తంభించే పరిస్థితి ఏర్పడింది. పాకిస్తాన్ అడ్వైజరీ బోర్డు ఈ విషయంలో తక్షణమే స్పందించి ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసింది ,

  నష్టాల్లో ఉన్న తమకు పాకిస్తాన్ ప్రభుత్వం గాని ,పాకిస్తాన్ బ్యాంకులు గాని ఎటువంటి ఆర్థిక సహాయం చేయకపోవడం వల్ల ప్రస్తుతం ఈ సంక్షోభానికి ఒక ప్రధాన కారణమని చమురు సంస్థల ప్రతినిధులు చెప్పారు . యుద్ధం సూచనలు ఉన్నప్పటికీ పాకిస్తాన్ ముందు జాగ్రత్త పడకపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది మరి కొన్ని దేశాల్లో కూడా ఇదే పరిస్థితి దాపురించే ప్రమాదం ఉందని తెలుస్తోంది ..

   

  ఇవీ చదవండి… 

  అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

  నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

  చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

  సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో..