ఆరు గేర్లతో యమహా కొత్త బైక్.. ధర ఎంతంటే..?

  0
  450

  భారత్ మార్కెట్లోకి యమహా కొత్త మోటర్ సైకిల్ ని మార్కెట్ లోకి తెచ్చింది. ముఖ్యంగా స్పీడ్ గా వెళ్లేందుకు ఇష్టపడే యువతకోసం దీన్ని రూపొందించినట్టు తెలిపారు కంపెనీ ప్రతినిధులు. ధర కూడా అందుబాటులోనే ఉంది. దీని పేరు యమహా ‘వైజెడ్‌ఎఫ్‌-ఆర్‌ 15ఎస్‌ వీ3. ఢిల్లీ షోరూంలో ఈ బైకు ధరను రూ.1.57 లక్షలుగా నిర్ణయించింది. ఇతర నగరాల్లో ధరలలో కాస్త తేడా ఉంటుంది. 155 సీసీ సామర్థ్యం కలిగిన ఈ బైకు గరిష్ఠంగా 18.6 పీఎస్‌ శక్తిని విడుదల చేస్తుంది. ఫ్యూయల్‌ ఇంజెక్టడ్‌ మోటర్‌, ఆరు గేర్లు ఉన్నాయి. గడిచిన నాలుగేండ్లలో 2.75 లక్షల యూనిట్ల బైకులను దేశీయంగా విక్రయించినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.

  ఆర్‌15 వీ3 వేరియంట్ 155సీసీ, 4స్ట్రోక్‌, లిక్విడ్ కూల్డ్‌ ఇంజిన్‌ ఏర్పాటు చేశారు. ఈ బైక్‌ 10000ఆర్‌పీఎమ్‌ వద్ద 18.6పీఎస్‌ గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తోంది. 8500 ఆర్‌పీఎమ్‌ వద్ద 14.1 ఎన్‌ఎమ్‌ టార్క్‌ అవుట్‌ పుట్‌ను అందిస్తోంది. యమహా ఆర్‌15 వీ3 బైకు 6 స్పీడ్‌ గేర్‌ బాక్స్‌ను జత చేశారు.

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.