కలియుగ వైకుంఠం లో జలప్రళయం, ఈ రోజు మరీ తీవ్రం. ?

  0
  970

  తిరుపతిలో కనీవినీ ఎరుగని జలప్రళయం సంభవించింది..ఈ రోజు భారీ వర్షాలు మరీ తీవ్ర స్థాయిలో ఉంటాయని చెప్పడంతో , చిత్తూరు జిల్లా , చిగురుటాకులా వణికిపోతొంది. చెన్నైలో కంటే ఘోరంగా పరిస్థితులు ఉన్నాయి.. తిరుపతి వీధులన్నీ నదులుగా మారిపోయాయి.. నదులుగా మారిన వీదుల్లో వాహనాలు కొట్టుకుపోతున్నాయి. ప్రజలు , రోడ్డుదాటాలంటేనే వీలుకాని పరిస్థితి. రోడ్లలో ప్రవహిస్తున్న నీటి ఉధృతికి , కొట్టుకుపోతున్నారు. చిత్తూర్ జిల్లాలోలో పలు ప్రాంతాల్లో పశువులు వరదల్లో కొట్టుకుపోతున్న దృశ్యాలు దయనీయంగా ఉన్నాయి. జిల్లాలో ప్రజాజీవనం మొత్తం స్తంభించిపోయింది.. తిరుమలలో గత శతాబ్దంలో ఎన్నడూ లేనంత , వర్ష బీభత్సం కొనసాగుతొంది. ఘాట్ రోడ్డు మూసేశారు. తిరుమల ఆలయ ప్రాంగణం నదిలా మారింది. నాలుగు మాడా వీధుల్లో నదిని తలపించే దృశ్యాలు. క్యూ లైన్లు కూడా నదుల్లా పారుతున్నాయి. రవాణా వ్యవస్థ మొత్తం స్తంభించిపోయింది. రెండు రోజులు గడిస్తేగానీ ఏమౌతుందో చెప్పలేని పరిస్థితి.. మరోవైపు , తిరుపతి , కడప రోడ్డు బాలపల్లి రేంజ్ లో నదిగా మారి , ఉదృతంగా ప్రవహిస్తోంది.. వాహనాలనుంచి మనుషులు దిగితే కొట్టుకుపోయే పరిస్థితి..

  భక్తులు స్వామి దర్శనానికి పోయే క్యూలైన్లు , నదుల్లా మారి..

   

  నదుల్లా మారిన వీధుల్లో కార్లు , ఆటోలు కొట్టుకుపోతూ..

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.