ప్రపంచంలోనే అతి పొడవైన కారు మళ్ళీ పూర్తి హంగులతో రోడ్డు మీదకొస్తోంది. ఈనెల 1వ తేదీన సూపర్ లిమో కారును వంద అడుగుల రెండు అంగుళాల పొడవుతో రూపొందించారు. 1986 నాటి అతి పొడవైన కారును ఇప్పుడు మరింత పొడవుగా మార్చి, ఆ రికార్డును బ్రేక్ చేశారు. ఈ కారును 1986లో కార్నిఫోలియాలో బర్బాంగ్ లో తయారు చేశారు.
మొదటలో 26 చక్రాలు 60 అడుగులతో ఈ కారు రూపొందింది. దీనికి వెనక ముందు రెండు వీఐటీ ఇంజన్లు అమర్చారు. ఆ తర్వాత దీన్ని వంద అడుగులకు పెంచి, ఇప్పుడు మళ్ళీ ఒకటిన్నర అంగుళం పొడవు పెంచారు. ఈ కారుకు మధ్యలో ఒక లింక్ ఏర్పాటు చేసి, మలుపుల్లో కూడా సులభంగా డ్రైవ్ చేసే విధంగా తయారు చేశారు.
రాజభోగాలు సమకూర్చిన ఈ కారులో వాటర్ బెడ్, స్విమ్మింగ్ ఫూల్, డైవింగ్ బోర్డ్, బాత్ టబ్, చిన్న గోల్ప్ కోర్స్, ఒక చిన్న హెలీప్యాడ్, 75 మంది ప్రయాణం చేయగల సీటింగ్ కెపాసిటీ ఈ కారులో ఉన్నాయి. హెలీప్యాడ్ ను స్టీల్ బ్రాకెట్స్ తో నిర్మించారు. 5 వేల పౌండ్ల బరువు ఉన్న హెలికాఫ్టర్ ను ఇది మోయగలదు. దీనిలోనే చాలా టీవీలు, రిఫ్రజరేటర్లు, టెలిఫోన్ సౌకర్యాలు కూడా ఉన్నాయి. 1986లో ఈ కారును గిన్నీస్ బుక్ గుర్తించిన తర్వాత, ఇందులో అనేక మార్పులు చేశారు. చివరగా అత్యాధునికైన మార్పులతో రూపొందించి తిరిగి వాడుకలోకి తెచ్చారు. ఈ కారును ఆధునీకరించేందుకు 3 కోట్ల రూపాయల ఖర్చయింది.