మళ్లీ వచ్చింది.. చైనాలో అన్నీ మూసేశారు..

  0
  704

  చైనాలో మళ్లీ లాక్ డౌన్ ఆంక్షలు విధించారు. చైనాలో మళ్లీ మళ్లీ కోవిడ్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో లాక్ డౌన్ విధించక తప్పనిసరిగా మారింది. ఈశాన్య న‌గ‌ర‌మైన చాంగ్‌చున్‌లో కొత్త వేరియంట్ బయటపడటంతో అధికారులు లాక్‌డౌన్ విధించారు. దీంతో కఠినంగా ఆంక్షలను అమలు చేస్తున్నారు. 90 లక్షలు ఉన్న చాంగ్‌చున్‌లో కొత్త వేరియంట్ కరోనా వైరస్ చాలా వేగంగా వ్యాపిస్తోందని అధికారులు వెల్లడించారు. దీంతో స్థానికులు ఎవ‌రూ ఇంటి నుంచి బ‌య‌ట‌కు రావొద్దని ఆంక్షలు పెట్టారు. మరోవైపు ఫ్యామిలీ స‌భ్యుల్లో ఒక‌రే నిత్యావ‌స‌రాల కోసం బ‌య‌ట‌కు వెళ్లాలని సూచించారు. అది కూడా రెండు రోజుల‌కు ఒక‌సారి మాత్రమే బయటకు రావాలని ఆంక్షలు విధించారు. కోవిడ్ కేసులు మరోసారి పెరగటంతో స్కూల్స్ మరోసారి మూసి వేశారు అధికారులు. పీటీఐ ప్రకటనతో భారత్ లో కూడా ఆందోళనలు మొదలయ్యాయి.

  శుక్రవారం (మార్చి 11,2022)న ఒక్కరోజే 1000 కేసులు నమోదు అయ్యాయి. వారంలోపే 300ల కేసులు నమోదుకావటంతో మరోసారి చైనాలో కోవిడ్ భయాందోళనలు నెలకొన్నాయి. ప్రపంచ దేశాలన్నీ కోవిడ్ థర్డ్ వేవ్ నుంచి కూడా బయటపడ్డాయి. కానీ చైనాలో మాత్రం పదే పదే కోవిడ్ కేసులు పెరుగుతున్న సందర్భాలు జరుగుతున్నాయి.

  మరోవైపు చాంగ్‌చున్ న‌గ‌రంలో ఉన్న ప్రతి ఒక్కరూ మూడు సార్లు కరోనా ప‌రీక్షలను చేయించుకోవాలని అధికారులు సూచించారు. అత్యవ‌స‌రం కాని సేవ‌లను ర‌ద్దు చేశారు. ట్రాన్స్‌పోర్ట్ లింకుల‌ను కూడా మూసివేశారు. కాగా 2020 మార్చి తర్వాత గత కొన్ని రోజులుగా చైనాలో రోజువారీ అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. గ్వాంగ్‌ డాంగ్, జిలిన్, షాన్‌ డాంగ్ ప్రావిన్సులలో మెజారిటీ కేసులు నమోదవుతున్నట్లు అధికారులు తెలిపారు.

  చైనా ప్రత్యేక పరిపాలన ప్రాంతం హాంకాంగ్‌లో కూడా భారీగా కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. దీంతో అధికారులు తగిన చర్యలు చేపట్టారు. కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో స్కూళ్లు మూసి వేశారు.అలాగే వ్యాపారాలను కూడా మూసివేశారు. రవాణా మార్గాలల్లో కూడా ఆంక్షలు విధించారు.

  ఇవీ చదవండి… 

  అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

  నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

  చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

  సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో..