తెలుగు సినిమా హీరోపై చీటింగ్ కేసు..

  0
  564

  తండ్రి నిర్మాత, కొడుకు హీరో.. వారిద్దర్నీ నమ్మి ఓ వ్యక్తి 85 లక్షల రూపాయలిచ్చాడు. కానీ వారు తిరిగివ్వలేదని ఇప్పుడు గొడవ చేస్తున్నాడు. నాలుగేళ్ల క్రితం గొడవ ఇది. ఇప్పుడిది కేసుల వరకు వెళ్లింది.
  సినీ నిర్మాత బెల్లకొండ సురేశ్‌, ఆయన కుమారుడు బెల్లంకొండ శ్రీనివాస్‌పై కేసు నమోదైంది. నాంపల్లి కోర్టు ఆదేశాలమేరకు ఇద్దరిపైనా సీసీఎస్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రకాశం జిల్లాకు చెందిన శ్రవణ్‌ బంజారాహిల్స్‌లో నివాసం ఉంటున్నారు.

  బెల్లంకొండ సురేశ్‌, శ్రీను కలిసి 2018లో తన వద్ద విడతల వారీగా రూ.85లక్షలు తీసుకున్నారని శ్రవణ్‌ నాంపల్లి కోర్టులో వ్యాజ్యం వేశారు. మలినేని గోపీచంద్‌ దర్శకత్వంలో తీస్తున్న సినిమాకు సహ నిర్మాతగా తీసుకుంటామని నమ్మించి మోసం చేశారని బాధితుడు పిటిషన్‌లో పేర్కొన్నాడు. బాధితుడి ఫిర్యాదు స్వీకరించిన నాంపల్లి కోర్టు.. ఇద్దరిపైనా కేసు నమోదు చేయాలని సీసీఎస్‌ పోలీసులను ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు బెల్లకొండ సురేశ్‌, శ్రీనివాస్‌పై సీసీఎస్‌లో కేసు నమోదైంది.

  ఇవీ చదవండి… 

  అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

  నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

  చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

  సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో..