ఆ గద్ద అన్ని కోట్లు ధర ఎందుకో తెలుసా..?

  0
  373

  పెంచుకోడానికి పక్షుల్ని కొనేవారు వందల్లో, వేలల్లో ఖర్చు పెడుతుంటారు. అయితే పందాలకోసం పక్షుల్ని కొనేవాళ్లు కాస్త ఎక్కువే ఖర్చు పెట్టాల్సిన సందర్భం. అయితే అలాంటి పక్షుల్లో ఇప్పుడు ప్రపంచ రికార్డు బద్లు కొట్టింది గిర్ ఫాల్కన్ గద్ద. ఈ తెల్ల గద్ద ఇప్పుటి వరకు ప్రపంచంలో అమ్ముడుపోయిన అత్యంత ఖరీదైన వాటిలో ఒకటి. సౌదీ అరేబియాలోని రియాద్ లో జరిగిన వేలంలో ఓ వ్యక్తి దీన్ని 3 కోట్ల 43 లక్షల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేశాడు.

  గిర్ ఫాల్కన్ గద్ద ప్రత్యేకతలేంటి..?
  సౌదీలో దీన్ని పందేలాకోసం వినియోగిస్తారు. అలాంటిలాంటి పందేలు కావు, వాటి స్పీడ్ ని రేసర్ కార్లు కూడా అందుకోలేవు. అలాంటిది రెండు పక్షులకు పోటీ పెడితే ఆ మజా ఎలా ఉంటుందో ఊహించుకోండి. అలాంటి పందాలకు సౌదీ పెట్టింది పేరు. అందుకే కోట్లు ఖర్చు పెట్టి మరీ మేలు రకం గిర్ ఫాల్కన్ లను కొనుగోలు చేస్తుంటారు.

  మగపక్షి కేజీ నుంచి ఒకటిన్నర కేజీ వరకు బరువు ఉంటుంది. ఆడ పక్షి బరువు 2 కిలోల వరకు ఉంటుంది. రెక్కలు తెరిస్తే 110–160 సెంటీ మీటర్ల వరకు ఉంటుంది. సహజంగా ఇవి బూడిద రంగులో ఉంటాయి. అయితే ఇప్పుడు వేలంలో 3 కోట్ల 43 లక్షల రూపాయలు ధర పలికిన గిర్ ఫాల్కన్ మాత్రం తెల్లగా ఉంది. ఇది ఇతర చిన్న చిన్న పక్షులను, కుందేలు వంటి జంతువుల్ని అమాంతం తినేస్తుంది.

  ఆకాశంలో తిరుగుతున్నా నేరుగా భూమిపై ఉన్నవాటిని చూస్తుంది. వాటిని ఎగరేసుకు పోతుంది. అయితే ఇవి త్వరగా అంతరించిపోతున్నాయి. పందేలకోసం వీటిని వేటగాళ్లు పట్టుకుని అమ్మేస్తుంటారు. ఈ క్రమంలో చాలా వరకు దెబ్బలు తగిలి అవి చనిపోతుంటాయి.

  ఇవీ చదవండి..

  రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..

  ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ..

  తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

  పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్