ఒక భర్త నలుగురు ప్రియుళ్లు.ఒకడిని చంపేసింది.

  0
  12074

  ఆమెకు ఒక భ‌ర్త‌. న‌లుగురు ప్రియులు. ఎదురు తిరిగితే ప్రియుళ్ళ‌ను చంపేస్తుంది. ఆమె రాక్ష‌స‌త్వం, కాముకం చూసి భ‌ర్త కూడా నోరు మెద‌ప‌లేదు. రెండేళ్ళ క్రితం ఓ ప్రియుడిని చంపి మ‌రో ప్రియుడు, భ‌ర్త సాయంతో పొలంలో పాతి పెట్టింది. నాలుగో ప్రియుడితో స‌ర‌సంలో ప‌డింది. నాలుగో ప్రియుడు త‌న‌ను నిర్ల‌క్ష్యం చేస్తున్నాడ‌న్న భావ‌న‌తో మొద‌టివాడిని చంపిన‌ట్లు నిన్ను కూడా చంపి పాతి పెట్టేస్తాన‌ని బెదిరించింది. దీంతో నాలుగో ప్రియుడు పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో… చిత్ర అనే మ‌హిళ క్రూర‌త్వం బ‌య‌ట‌ప‌డింది.

  త‌మిళ‌నాడులోని చిన్న‌క్క పాళ్యంలో చిత్ర‌, ర‌మేష్ భార్యాభ‌ర్త‌లు. బంధువుల్లోనే ప‌ద‌హారేళ్ళ అబ్బాయి, మ‌ణికంద‌న్ అనే 20 ఏళ్ళ యువ‌కుడితో ఆమె అక్ర‌మ సంబంధం పెట్టుకుంది. భ‌ర్త‌కు తెలిసే ఇదంతా జ‌రిగింది. గ‌త ఏడాది సెప్టెంబ‌రులో చిత్ర, ఇద్ద‌రు ప్రియులు, భ‌ర్త క‌లిసి మార్కెట్ కి వెళ్ళారు. అక్క‌డ మ‌ణికంద‌న్ కు మైన‌ర్ అయిన మ‌రో ప్రియుడికి మ‌ధ్య గొడ‌వ జ‌రిగింది. ఇంటికి వ‌చ్చిన త‌ర్వాత ఆ గొడ‌వ పెద్ద‌ది కావ‌డంతో మ‌ణికంద‌న్ ను చిత్ర‌, మైన‌ర్ బాలుడు తీవ్రంగా కొట్ట‌డంతో చ‌నిపోయాడు. ఆ శ‌వాన్ని చిత్ర, భ‌ర్త‌, మైన‌ర్ బాలుడు త‌మ పొలంలోనే పూడ్చి పెట్టేశారు. ఇది జ‌రిగి ఏడాది గ‌డిచింది.

  చిత్ర మ‌ళ్ళీ నంద‌కుమార్ అనే 25 ఏళ్ళ యువ‌కుడితో అక్ర‌మ సంబంధం పెట్టుకుంది. రెండో నెల గ‌ర్భ‌వ‌తి అయింది. త‌న‌ను స‌రిగా చూసుకోక‌పోతే మ‌ణికంద‌న్ ను చంపిన‌ట్లే నిన్ను కూడా చంపేస్తాన‌ని హెచ్చ‌రించింది. దీంతో భ‌య‌ప‌డ్డ నంద‌కుమార్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఆమెను తీసుకెళ్ళి విచారించ‌గా చేసిన నేరం ఒప్పుకుని, త‌న మొద‌టి ప్రియుడు శ‌వాన్ని పాతి పెట్టిన స్థ‌లాన్ని చూపించింది. దీంతో ఆమెను, ఆమె భ‌ర్త‌ను, ప్రియుడిని అదుపులోకి తీసుకున్నారు.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.