మహాశ్వేత చక్రవరి.. మహిళా పైలెట్ గా ఉక్రెయిన్లో ..

    0
    186

    ఈ అమ్మాయిని చూడండి , పేరు మహాశ్వేత చక్రవర్తి . యుద్ధంతో అల్లకల్లోలంగా ఉన్న ఉక్రెయిన్ లోకి ప్రవేశించి ఎనిమిది వందల మంది వెనక్కి తీసుకు వచ్చింది.. 24 ఏళ్ల వయసున్న మహాశ్వేత చక్రవర్తి ఎయిర్ ఇండియా పైలెట్ గా ఉండేది. ఇప్పుడు ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన మన భారతీయులను 800 మందిని నాలుగు దఫాలుగా విమానంలో వెనక్కి తీసుకు వచ్చింది.. పోలేండ్ , హంగేరి సరిహద్దుల్లో చిక్కుకుపోయిన మన భారతీయులను అత్యంత ధైర్యసాహసాలను ప్రదర్శించి సరిహద్దుల్లోని విమానాశ్రయాల్లో విమానాన్ని దించి వాళ్ళందర్నీ వెనక్కి తీసుకు వచ్చింది.

    మహా శ్వేత చక్రవర్తి బీజేపీ పశ్చిమబెంగాల్ మహిళా మోర్చ నాయకురాలు కూతురు. రష్యా యుద్ధం మొదలైన తర్వాత ఇప్పటివరకు దాదాపు 20వేల మంది భారతీయులను మన ప్రభుత్వం వెనక్కి తీసుకు వచ్చింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో రక్షణ బలగాలు చుట్టుముట్టి నేడో రేపో దాన్ని ఆక్రమిస్తాయి అనుకున్న తరుణంలో దాదాపు భారతీయులందరినీ మన ప్రభుత్వం వెనక్కి తీసుకు వచ్చేసింది. భారతీయులను విమానాల ద్వారా వెనక్కి తీసుకు రావడం మహాశ్వేత చాలా ధైర్యసాహసాలు చూపింది.

    తన విధి నిర్వహణలో విరామం కూడా తీసుకోకుండా పైలెట్ గా పనిచేసి అద్వితీయమైన ప్రతిభ కనబరిచింది. యుద్ధంతో ఉక్రెయిన్ కకావికలం అవుతున్న సమయంలో భారతీయులను వెనక తీసుకురావడమే పైలెట్ గా , తన విధి అని భావించానని ప్రాణాలకు భయపడలేదని మహాశ్వేత చక్రవర్తి చెప్పింది. యుద్ధం లో చిక్కుకుపోయిన భారతీయులను వెనక్కి తీసుకు రావడంతో పైలెట్ గా తన జీవితం ధన్యమైందని కూడా ఆమె ఆనందం వ్యక్తం చేసింది. ఇప్పటికీ కొద్ది మంది భారతీయులు అక్కడే ఉండిపోయారని ఇష్టప్రకారమే అక్కడ ఉండి పోతున్నట్టు ప్రకటించారని ప్రభుత్వం ప్రకటించింది.

     

    ఇవీ చదవండి… 

    అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

    నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

    చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

    సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో..