చైనాలో ఐటి సిటీలో కరోనా విజృంభణ – నగరాన్ని సీల్ చేశారు..

  0
  139

  చైనాలో మళ్లీ కరోనా విజృంభిస్తుంది ఈ పరిణామం పొరుగునే ఉన్న భారతదేశానికి తీవ్రమైన ఆందోళన కలిగించే విషయం. గత మూడు రోజుల్లో చైనాలో కొత్తగా కరోనా సోకిన వారి సంఖ్య మూడింతలు పెరిగింది ఇదే ఇప్పుడు చైనాకు నిద్రలేకుండా చేస్తోంది. దీంతో ప్రపంచ ప్రసిద్ధి చెందిన చైనా హైటెక్ నగరం షెన్జెన్ లో లాక్డౌన్ విధించారు. షెన్జెన్ లో ఆదివారం నుంచి సోమవారం వరకు పూర్తిస్థాయిలో లాక్డౌన్ విధించారు ఆ నగరం లోకి ఇతరులు రాకూడదు నగరంలోని వ్యక్తులు బయటికి పోకూడదు.షెన్జెన్ నగరంలో విజృంభిస్తున్న కరోనా ను పూర్తిస్థాయిలో అరికట్టేందుకు అధికారులు ప్రతి ఇంటికి ఆరోగ్య పరీక్షలు చేయాలని నిర్ణయించారు.

  నగరంలో ఉన్న ఒక కోటి 70 లక్షల మంది ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు అదనంగా మరో పదివేల మంది ఆరోగ్య సిబ్బందిని రప్పించారు. చైనాలోని 16 రాష్ట్రాల్లో కొత్త కరోనా కేసులు నమోదవుతున్నాయి , అతిపెద్ద నాలుగు నగరాలు బీజింగ్ , తియాంజిన్ , షాంగై, చాంగింగ్ లలో ఇదివరకే కేసులు రోజువారీ సంఖ్యా మూడింతలు పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుతున్న తరుణంలో ఇప్పుడు చైనాలో కరోనా విజృంభణ సహజంగా ప్రపంచదేశాలకు ఆందోళన కలిగించే విషయం. 2019లో వుహాన్ నగరంలో తలెత్తిన కరోనా ఆ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా కలకలం సృష్టించింది.

  చైనా ఉపాధ్యక్షుడు సన్ చిన్ లన్ శనివారం నాడు జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో కరొనను అరికట్టేందుకు దేశవ్యాప్తంగా ప్రజలు , ఆరోగ్య కార్యకర్తలు కార్యకర్త నడుం బిగించాలని కోరారు. దేశంలో మళ్లీ అందరికీ యాంటిజెన్ పరీక్షలు నిర్వహణకు సిద్ధమయ్యారు. షాంగై నగరం నుంచి ఎవరు బయటకు పోవాలన్నా బయట వాళ్ళు నగరంలోకి రావాలన్నా , 48 గంటల ముందు చేయించుకున్న న్యూక్లియస్ యాసిడ్ టెస్ట్ రిపోర్ట్ ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే అని చైనా అధికారిక మీడియా జిన్హువా వార్తాసంస్థ తెలిపింది..

  ఇవీ చదవండి… 

  అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

  నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

  చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

  సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో..