పుతిన్ ఆరోగ్యంపై ఐదు కళ్ళు.. ఏమిటవి.. ?

  0
  73

  రష్యా అధ్యక్షుడు పుతిన్ యుద్ధోన్మాదానికి కారణం ఏమిటి ..? పసిబిడ్డ లాంటి ఉక్రెయిన్ ని ,ఉక్కు పాదాలతో అణిచివేయాలని నిర్ణయం వెనుక ఏం జరిగింది..? పుతిన్ మానసిక పరిస్థితి ఎలా ఉంది ..? గత ఐదేళ్లుగా ఈ వ్యవహారాలను పరిశీలిస్తున్న అధికారులు రహస్యంగా తయారుచేసిన నివేదిక ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఐదు దేశాలు ఇంటెలిజెన్స్ అధికారుల తో కూడుకున్న ఒక నివేదికను తయారుచేసింది. ఫైవ్ ఐస్ అంటే ఐదు కళ్ళు అనే ఇంటెలిజెన్స్ అధికారులతో కూడిన ఫైవ్ ఐస్ తయారుచేసిన నివేదిక పుతిన్ మానసిక పరిస్థితికి అద్దం పట్టింది. ఆస్ట్రేలియా కెనడా , న్యూజిలాండ్ ,బ్రిటన్ , అమెరికా ఇంటెలిజెన్స్ అధికారుల తో కూడిన అధికారుల బృందాన్ని ఫైవ్ అయిస్ అంటారు.

  ఈ అధికారులు సమగ్రంగా పరిశీలించి అనేక నివేదికను అధ్యయనం చేసిన పిమ్మట ఇచ్చిన నివేదిక ఆందోళన కలిగిస్తోంది. పుతిన్ గత ఐదేళ్లుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు . ఈ వ్యాధికి ఈ వ్యాధి నివారణ కోసం ఆయన స్టెరాయిడ్స్ వాడుతున్నారు. సుదీర్ఘకాలం స్టెరాయిడ్లు వాడడం వల్ల ఆయన రాయిడ్ రేజ్ అనే వ్యాధితో బాధపడుతున్నారని తెలిపింది. ఈ వ్యాధితో బాధపడేవారికి ఉన్మాదం ,పిచ్చి మానసిక చాంచల్యం ఇలాంటివి సహజంగానే ఉంటాయి. దీనికితోడు పుతిన్ ఒకటిన్నర సంవత్సరాల క్రితం కరోనా వ్యాధికి గురయ్యారు. ఆతర్వాత ఆరోగ్య పరిణామాలు కూడా ఆయన్ను ఇలా తయారు చేశాయి అని చెబుతున్నారు.

  పుతిన్ గతంలో లాగా నిర్ణయాలు తీసుకోవడంలో సరళమైన ధోరణిని అవలంబించడం లేదు . ఈ విషయంలో ఇది చాలా స్పష్టంగా కనిపిస్తోంది అని పేర్కొన్నారు. తన చుట్టూ ఉన్న అనుచరుల మాటల కానీ ,ఇంటెలిజెన్స్ నివేదికలు కానీ మిలిటరీ అధికారులు నిర్ణయాలు ఏవీ కూడా ఆయన పట్టించుకోవడంలేదట.. కాన్సర్ వ్యాధికి 69 ఏళ్ల పుతిన్ సుదీర్ఘకాలం స్టెరాయిడ్స్ వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ తో బాధపడుతున్నారని , ఆయనకు మొఖం వాచి పోవడం , మెడ ఉబ్బి ఉండటం , కళ్ళు మూతపడుతుండటం ఇలాంటి లక్షణాలు అన్నీ కూడా రాయిడ్ రేజ్ వ్యాధి కారణంగానే ఉన్నాయని తేల్చారు.

  తన రాజకీయ అనుచరులని గాని, మిలటరీ అధికారులని గాని, హోంశాఖ అధికారులని గాని, ఎవరితోనూ మాట్లాడకుండా తన నిర్ణయాలు అమలు చేయాలని ఆదేశాలు ఇచ్చారని
  దీనిని బట్టే ఆయన మానసిక పరిస్థితి , ఆయన ఆరోగ్య దుస్థితి స్పష్టంగా అర్థమవుతోందని ఇంటెలిజెన్స్ నివేదికలు తేల్చాయి. పుతిన్ మానసిక రుగ్మత , ఉన్మాదం ,డిప్రెషన్ ఇలాంటి జబ్బులతో బాధపడుతూ యుద్ధం పై నిర్ణయం తీసుకున్నారని చివరకు తేల్చారు..

   

  ఇవీ చదవండి… 

  అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

  నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

  చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

  సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో..