ఏడాదిలో 21 మంది బిడ్డలు.. వామ్మో ఎలా..?

  0
  352

  ఏడాదిలో ఓ మహిళ 21మంది బిడ్డల్ని కన్న తల్లి అయింది. 21మంది బిడ్డలకు తల్లి కావడం అంటే అది నమ్మలేని నిజమే అయినా, నమ్మాల్సిన సత్యమే. రష్యాకు చెందిన క్రిస్టినా అనే 24 ఏళ్ల మహిళ, అద్దె గర్భాల ద్వారా 21మంది బిడ్డలకు తల్లి అయింది. ఆమె కోటీశ్వరుడైన 57ఏళ్ల గాలిబ్ అనే వ్యక్తిని జార్జియాలో ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇదివరకే ఆమెకు పెళ్లై ఆరేళ్ల కూతురు ఉంది.

   

  కోటీశ్వరుడైన భర్త వచ్చిన తర్వాత ఆమెకు ఎక్కువమంది బిడ్డలు కావాలనే కోరిక కలిగింది. దీంతో తన భర్త వీర్యం ద్వారా 21మంది మహిళలను అద్దె గర్భాలకు తీసుకుని ఒక్క ఏడాదిలోనే 21మంది బిడ్డల్ని ఇంటికి తెచ్చుకుంది. ఈ బిడ్డలకోసం 16మంది ఆయాలను పెట్టి ఏడాదికి దాదాపు 70 లక్షల రూపాయల జీతం ఇస్తోంది.

  అద్దె గర్భాల ద్వారా ఈ బిడ్డల్ని కనేందుకు ఒకటిన్నర కోట్ల రూపాయలు అద్దె గర్భాల తల్లులకు ఇచ్చింది. 105మంది బిడ్డలు కావాలన్నది తన కోరిక అని, వారందర్నీ కూడా ప్రస్తుత భర్త గాలిబ్ ద్వారానే పొందాలని ఆశపడుతున్నానని చెప్పింది. సాధ్యమైనంత తొందరగా మిగిలిన 84మంది బిడ్డల్ని అద్దె గర్భాల ద్వారా కనేసి, అందర్నీ మూడంతస్తుల భవనంలో ఉంచి పెంచుకుంటానని క్రిస్టినా చెబుతోంది.

  ప్రస్తుతం ఇంతమంది బిడ్డలతో తనకు బాగా పొద్దుపోతోందని వారికి కావాల్సిన వస్తువులు, ఆరోగ్యం, పాలు, ఆహారం, ఇలాంటి వాటితో తీరిక లేకుండా ఉన్నానని చెప్పింది. బిడ్డలకోసం వారానికి 4 లక్షల రూపాయల వ్యయం చేస్తోంది.

  ఇవీ చదవండి… 

  అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

  నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

  చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

  సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో..