అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో వచ్చిన ‘పుష్ప’ మూవీ సృష్టించిన సునామీ అందరికీ తెలిసిందే. ఇక ఆ సినిమాలో ”ఊ.. అంటావా మామా..” అనే మాస్ మసాలా పాటతో కుర్రాళ్ళ మంతులు పోగొట్టింది సమంత. మగాళ్ళను కించపరిచేలా ఉందని కొంతమంది ఈ పాటపై తీవ్ర అభ్యంతరం కూడా వ్యక్తం చేశారు. అయితే ఈ మాస్ మసాలా సాంగులో స్టెప్పులు వేసేందుకు తొలుత దిశాపటానీకి అవకాశం వచ్చిందట.
అయితే ఆమె రిజెక్ట్ చేయడంతో సమంతను ఎంపిక చేశారు. ఇక సినిమా రిలీజ్ తర్వాత ఆ పాట ఎంత హైలెట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాగా ఇప్పుడు దానికి సీక్వెల్ గా ”పుష్ప-2” తెరకెక్కుతోంది. ఇందులోనూ మంచి ఐటెం సాంగ్ ఉందట. ఈ సాంగ్ చేయడానికి దిశపటానీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఫస్ట్ పార్ట్‌లో మిస్ చేసుకున్న లక్కీ చాన్స్ ను సెకండ్ పార్ట్ లో అందుకుంది దిశ. ఇందుకోసం ఆమె పెద్దమొత్తంలోనే రెమ్యూనరేషన్ తీసుకుంటోందని టాక్ వినిపిస్తోంది. మరి దిశ నర్తించే మాస్ సాంగ్ ఎలా ఉండబోతోందనేది తెరపైన చూడాల్సిందే. వెయిట్ అండ్ వాచ్.