కొత్త జిల్లాల ఏర్పాటుకు తిరుపతి కేంద్రంగా ఏర్పడిన శ్రీ బాలాజీ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఏర్పాటుకు బ్రేక్ పడింది. బాలాజీ జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని తిరుపతి సమీప లోని పద్మావతి నిలయంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆద్వర్యంలోని పద్మావతి నిలయంలో 400 గదులు ఉన్నాయి . అత్యంత విశాలమైన ఈ భవనంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఏర్పాటు చేస్తే మిగిలిన ప్రభుత్వ కార్యాలయం ఒకే సముదాయంలో పెట్టవచ్చునని ఈ కాంప్లెక్స్ లో పెట్టవచ్చునని భావించారు.
అయితే పద్మావతి నిలయం ,భక్తుల విరాళాలతో కట్టిందని ,జిల్లా కలెక్టర్ కార్యాలయం అక్కడ పెట్టకూడదని హైకోర్టులో ఒక భక్తుడు కేసు వేశాడు . ఈ కేసును విచారించిన హైకోర్టు న్యాయమూర్తి పద్మావతి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఏర్పాటు చేయాలన్న నిర్ణయాన్ని నిలిపివేశారు. ప్రస్తుతానికి యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించారు.
దీంతో బాలాజీ జిల్లా కార్యాలయం ఏర్పాటుకు బ్రేక్ పడింది. టిటిడి భవనాలను , అందులోనూ వసతి భవనాలను కొత్త జిల్లా కలెక్టర్ కార్యాలయానికి తీసుకోవడం సమంజసం కాదు. భక్తుల విరాళాలుతో ఏర్పాటయ్యే నిర్మాణాలు , వారి ప్రయోజనాలకు , లేదా టీటీడీ పరిపాలన అవసరాలకు తప్ప , ఇతరత్రా వాడకూడదు అన్నది సహజ న్యాయం..