లేడీ పోలీస్ సింగం , మాఫియా లీడర్ తో దోస్తీ ,

  0
  11398

  ఓ మహిళా పోలీస్ ఆఫీసర్ ఏకంగా పేరుమోసిన మాఫియా గ్యాంగ్ లీడర్ నే పెళ్లి చేసుకుంది. ఇప్పుడు ఆమె పరారీలో ఉంది. ఆమెకోసం నోటీసులు జారీ చేసిన పోలీసు ఉన్నతాధికారులు ఆమెను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. జోథ్ పూర్ జిల్లా సిరోహి ప్రాంత పోలీస్ ఇన్ స్పెక్టర్ సీమా 10లక్షల రూపాయలు లంచం తీసుకుంటో ఓ కేసులో పట్టుబడింది. ఆ తర్వాత ఆమెను ఉద్యోగం నంచి సస్పెండ్ చేశారు. అంతకు ముందే స్మగ్లర్లను, మాఫియా లీడర్లను, పక్క జిల్లా పోలీసులు తరుముకుంటూ వస్తే, వారిని ఒక వాహనంలో ఎక్కించి జాగ్రత్తగా జిల్లా దాటించేసింది.

  ఈ వ్యవహారం కూడా ఆమెపై దర్యాప్తు జరుగుతూనే ఉంది. ఇంతలో పోలీస్ ఇన్ స్పెక్టర్ సీమా, జోథ్ పూర్ లోని కిషోర్ భాగ్ ప్యాలెస్ లో ఓ కరడుగట్టిన నేరస్థుడిని పెళ్లి చేసుకుంది. ఇందుకు సంబంధించి ఆమె అతడితో హోమ గండం చుట్టూ ఏడడుగులు వేస్తున్న వీడియో క్లిప్పింగ్ లు కూడా పోలీసులకు అందాయి. ఉద్యోగంలో ఉండగా తనకు తాను ఆడసింహంగా చెప్పుకునే సీమా తెర వెనక మాఫియా గ్యాంగ్ లతో సంబంధాలు, మాఫియా లీడర్ తో పెళ్లి, లంచగొండి వ్యవహారాలు అన్నీ బయటపడిన తర్వాత ఇప్పుడు అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆమెను పరారీలో ఉన్న నేరస్థురాలిగా రికార్డుల్లో పేర్కొన్నారు.

   

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.