జూలో జంతువులకన్నా ఘోరంగా ఆ లేడీస్..

    0
    90

    జూ సందర్శన కోసం వచ్చిన పర్యాటకుల మధ్య జరిగిన గొడవ తీవ్ర ఘర్షణకు దారి తీసింది. చివరికి రెండు కుటుంబాలు కలబడి కొట్టుకున్నాయి. చైనా రాజధాని బీజింగ్‌లోని వైల్డ్‌లైఫ్ పార్క్‌లో  జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.జూ సంద‌ర్శ‌న కోసం వ‌చ్చిన ప‌ర్యాట‌కుల గొడ‌వ ఉద్రిక్త‌త‌ల‌కు దారి తీసింది. పర్యాటకులు బిజీగా ఉన్న స‌మ‌యంలో ఇద్దరి మధ్య మొదలైన వాగ్వివాదం ఘర్షణకు దారితీసింది. అది క్రమంగా ఇరు కుటుంబాలు కలబడే స్థాయికి వెళ్లింది. ఇరు వర్గాల్లోని మహిళలు జుట్లు పట్టుకుని నేలపై పడి కొట్టుకున్నారు. చేతిలో చంటి బిడ్డతో ఉన్న ఓ మహిళ నేల మీద పడివున్న మహిళ జుట్టు పట్టుకుని లాగుతుండగా, మరో వ్యక్తి వచ్చి చంటి పిల్లాడితో ఉన్న మహిళను బలంగా తన్నాడు. దీంతో ఆమె అల్లంత దూరంలో ఎగిరిపడింది. దీంతో జూ సిబ్బంది ఇరు వర్గాలకు నచ్చజెప్పి పరిస్థితిని అదుపు చేశారు.