శతాబ్దం అంతానికి ఈ 12 నగరాలు సముద్రనీళ్లలో …?

    0
    118

    భార‌త‌దేశంలో ఈ శ‌తాబ్దం చివ‌ర‌లో 12 న‌గ‌రాలు స‌ముద్రం నీటిలో ఉంటాయ‌ని, 12 న‌గ‌రాల్లో స‌ముద్ర‌పు నీరు ప్ర‌వేశిస్తుంద‌ని నాసా అంచ‌నా వేసింది. వాతావ‌ర‌ణ మార్పుల‌పై అంత‌ర్జాతీయంగా ఏర్పాటు చేసిన ప్యాన‌ల్ నాసా నివేదిక ఆధారంగా తీవ్ర‌మైన హెచ్చ‌రిక‌లు చేసింది. వాతావ‌ర‌ణంలో చాలా వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయ‌ని, స‌ముద్ర మ‌ట్టం పెరుగుతోంద‌ని, దీనివ‌ల్ల భార‌తదేశంలో 12 న‌గ‌రాలు స‌ముద్ర‌పు నీటిలో మునుగుతాయ‌ని పేర్కొంది. 2100 సంవ‌త్స‌రానికి ఇది పూర్త‌వుతుంద‌ని కూడా తెలిపింది. భార‌త దేశంలో ముంబై, చెన్నై, కొచ్చిన్, విశాఖ‌, గోవా, మంగ‌ళూర్, ప‌ర్ దీప్, కిదిర్‌ పూర్, టూటీ కొర‌న్, కాండ్లా, భావ్ న‌గ‌ర్ ప‌ట్ట‌ణాలు మూడ‌డుగుల స‌ముద్ర‌పు నీటిలో ఉంటాయి. గ‌త కొన్నేళ్ళుగా ఈ న‌గ‌రాల‌కు స‌మీపంలో స‌ముద్ర మ‌ట్టం పెరుగుతున్న తీరును అంత‌రిక్షం ద్వారా చేసిన ప‌రిశోధ‌న‌ల ఆధారంగా ఈ నివేదిక ఇచ్చారు. ప్ర‌పంచ‌లో స‌గ‌టు కంటే ఆసియా దేశాల్లో స‌ముద్ర మ‌ట్టం వేగంగా పెరుగుతోంది. 2100 సంవ‌త్స‌రం లోప‌ల తుఫాన్ల కార‌ణంగా స‌ముద్రం నీటి మ‌ట్టం పెరిగి ఈ ప‌ట్ట‌ణాల్లోకి ప్ర‌వేశిస్తుంది. వందేళ్ళ‌కు ఒక‌సారి స‌ముద్ర మ‌ట్టం పెరిగి జ‌రిగే జ‌ల‌విల‌యం, ఈ శ‌తాబ్దం అంతానికి ప్ర‌తి సంవ‌త్స‌రం జ‌రుగుతూనే ఉంటుంది.

    శతాబ్దం అంతానికి ఈ నగరాలలో సముద్ర నీటి మట్టం ఇలా ఉంటుంది..