జలజ సూపర్ డ్రైవర్.. కేరళ టు కాశ్మిర్..

  0
  659

  కొంతమందికి కొన్ని లక్ష్యాలు ఉంటాయి .. ఒక ఆశయం ఉంటుంది, లక్ష్యం కోసం ,ఆశయం కోసం పోరాటం చేస్తూనే ఉంటారు.. వాటిలో కుటుంబ సంక్షేమం కూడా ముడిపడి ఉంటుంది . అలాంటి వారిలో జలజ అనే మహిళా ట్రక్ డ్రైవర్ సాహసం నిజంగా చాలా గొప్పది. కేరళ నుంచి కాశ్మీర్ వరకు ట్రక్ డ్రైవ్ చేయాలని ఆమె ఆలోచన. పశ్చిమ దేశాల్లో మాత్రమే మహిళలు హెవీ ట్రక్ డ్రైవర్లుగా పనిచేస్తుంటారు. అయితే భారతదేశంలో మాత్రం హెవీ వెహికిల్స్ లో ట్రక్ డ్రైవర్లు చాలా అరుదు. అందులోనూ అంతర్రాష్ట్ర డ్రైవర్లు మరీ ప్రత్యేకం.

  ఇటీవల కేరళలోని ఎర్నాకులం నుంచి కాశ్మీర్ వరకు జలజ తన ట్రక్కులో ఉల్లిపాయలు తీసుకెళ్ళింది . ఇది చాలా చాలా శ్రమతో కూడిన పని . మొదట కేరళ నుంచి ప్లైవుడ్ తీసుకొని , పునకి వెళ్ళింది. ప్లై ఉడ్ డౌన్లోడ్ చేసి మళ్లీ అక్కడి నుంచి ఉల్లిపాయలు తీసుకుని ఉల్లిపాయలు లారీ తో కాశ్మీర్ కి వెళ్ళింది. కేరళ నుంచి కాశ్మిర్ డ్రైవ్ చేసుకుంటూ పోవడం అనేది నిజంగా సాహసమే . కేరళ నుండి కాశ్మీర్ వరకు తన ప్రయాణంలో కర్ణాటక ,మహారాష్ట్ర ,మధ్యప్రదేశ్, రాజస్థాన్ ,హర్యానా ,పంజాబ్ రాష్ట్రాల మీదుగా శ్రీనగర్ కి తీసుకెళ్ళింది . గతంలో రెండు దఫాలు కొట్టాయం నుంచి ముంబైకి ట్రక్ లో సరుకు తీసుకెళ్లింది. అప్పుడు తన భర్త తనకు తోడుగా వచ్చాడు అని చెప్పింది .

  రాత్రి సమయాల్లో పోలీస్ స్టేషన్ సమీపంలో ట్రక్ పెట్టి నిద్రపోయేదాన్ని . వంట కూడా జనావాసాలు ఉన్న ప్రాంతాల్లోని నిలిపి వంట చేసుకునే దాన్నని జలజ చెప్పింది . ట్రక్కులో తన కాశ్మీర్ ప్రయాణంలో గుల్మార్గ్ ప్రాంతం మరపురాని మధురానుభూతిని కలిగించిందని ఆమె చెప్పింది . కేరళ నుంచి కాశ్మిర్ చేరతానని కూడా తాను అనుకోలేదని తెలిపింది. లారీ లోనే పడుకునేందుకు ఒక సౌకర్యం ఏర్పాటు చేసుకోవడంతో పెద్దగా అలసట లేకుండా ప్రయాణం చేశానని ఆమె చెప్పింది . తనతో పాటు తన భర్త , మరో బంధువు కూడా ట్రక్ లో తనతో కాశ్మీర్ వచ్చారని జలజ పేర్కొంది . కేరళలో మరో కాలేజీ విద్యార్థి కూడా విద్యార్థిని కూడా డ్రైవర్ గా పని చేస్తుంది. ఆమె పెట్రోల్ డీజిల్ ట్యాంకర్లు నడుపుతోంది ఆమెకు తోడుగా తండ్రి కూడా ఉంటారు.

   

  ఇవీ చదవండి… 

  బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

  మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

  ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

  ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి..