మంత్రి అవుతూనే రోజా సంచలన నిర్ణయం.. వామ్మో బోల్డ్ లేడీ.

    0
    527

    నన్ను ఐరన్ లెగ్ అన్న వాళ్ళు ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకుంటారు ..? అంటూ రోజా నిలదీస్తుంది . మంత్రివర్గ విస్తరణలో రోజాకు చోటు దొరకడంతో , ఆమె ఆనందంతో పొంగిపోతుంది. సీఎం జగన్మోహన్ రెడ్డి మహిళా పక్షపాతి , అని మహిళలకు క్యాబినెట్లో అధిక ప్రాధాన్యం ఇచ్చారని చెప్పింది . మంత్రిగా చోటు దొరకడం తన అదృష్టమని ,అదృష్టాన్ని వరంగా ప్రసాదించిన మహానుభావుడు జగన్మోహన్రెడ్డి అని రోజా చెప్పింది. తనది ఐరన్ లెగ్ అని దుష్ప్రచారం చేస్తున్నారని ఇప్పుడు ముఖ్యమంత్రి సీఎం జగన్ పుణ్యమా అని అది గోల్డెన్ లెగ్ అని చెప్పింది . తన ప్రాణం ఉన్నంత వరకు జగన్ కోసమే పని చేస్తానని రోజా చెప్పింది.

    మంత్రి పదవి రావడంతో ఇక నుంచి షూటింగులు కూడా మానేస్తానని , టీవీ ,సినిమా కార్యక్రమాలు చేయనని కూడా రోజా ప్రకటించింది . జబర్దస్త్ టాప్ రేటింగ్ ప్రోగ్రామ్స్ లో రోజా ఒక స్పెషల్ అట్రాక్షన్ గా ఉండేది. ఇక నుంచి రోజా జబర్దస్త్ ప్రోగ్రాం లో కూడా చేయడం లేదని దీన్నిబట్టి అర్థం అయిపోతుంది. ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన గుర్తింపు జీవితంలో మరిచిపోలేని అని చెప్పింది . గతంలో చంద్రబాబు నాయుడు తనను అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వనని చెప్పాడని గుర్తు చేసుకుంది. అప్పట్లో తనను అన్యాయంగా చట్టవిరుద్ధంగా అసెంబ్లీ నుంచి బహిష్కరించారని, ఉన్నత న్యాయస్థానం నుండి ఆదేశాలు తెచ్చుకున్నా కూడా తనను శాసనసభలోకి రానీయలేదని చెప్పింది.

    అయితే ఇప్పుడు తను రెండుసార్లు ఎమ్మెల్యేగా పని చేశానని ఏకంగా జగన్మోహన్ రెడ్డి తనను మంత్రి ని కూడా చేశారని చెప్పింది., గతంలో తనను ఐరన్ లెగ్ అని మాట్లాడిన వాళ్ళు ఇది గుర్తుంచుకోవాలని చెప్పింది. ఇదిలా ఉండగా కామెడీ షో జబర్దస్త్ మరొక రోజా స్థానంలో మరొకరిని ఎంపిక చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతోంది . మొదటినుంచి రోజా ఈ షోకి ఒక ప్రత్యేక ఆకర్షణ ఉండేది. ఒకరకంగా రోజా వల్లనే ఈ షో భలే పాపులర్ అయ్యింది . రోజాకు సినిమా హీరోయిన్ అన్న పేరు పోయి , జబర్దస్త్ రోజా అనే పేరు స్థిరపడి పోయింది అంటే జబర్దస్త్ షోలో ఆమె ప్రాముఖ్యం ప్రాధాన్యత ఉందో ఇట్టే తెలిసిపోతుంది..

    ఇవీ చదవండి… 

    బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

    మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

    ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

    ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి..