ఎర్రకోట కోసం సుల్తానా కేసు, కొట్టేసిన కోర్టు.

  0
  390

  ఢిల్లిలోని ఎర్రకోట తమ వంశీకులదని సుల్తానా అనే మహిళ వేసిన పిటీషన్ ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. సుల్తానా ప్రస్తుతం , కలకత్తాలోని మురికివాడలో ఒక పేరుపడ్డ పూరింటిలో ఉంది. తాను చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ ఝా జాఫర్ -|| , మునిమనవడు మీర్జా ముహమ్మద్ భక్త్ భార్యనని చెప్పుకుంటుంది. తన భర్త 1980, మర్చి నెల 22 వతేది చనిపోయారని చెప్పింది. 1857 లో ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ ఎర్రకోటను తన పూర్వీకులనుంచి స్వాధీనం చేసుకుందని పిటీషన్ వేసింది. ఇప్పుడు తనకు ఎర్రకోటను స్వాధీనం చెయ్యాలని , లేదంటే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది. కేసు విచారించిన ఇద్దరు న్యాయమూర్తులు , ఈ పిటీషన్ అసంబద్దమైనదని పేర్కొంటూ కొట్టివేశారు.

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.