క్యాబ్ డ్రైవర్ సైడ్ ఇవ్వలేదని , దారుణంగా కొట్టింది..

  0
  7292

  ఢిల్లీలో క్యాబ్ డ్రైవర్ ని ఓ మహిళ చితకబాదింది. షర్ట్ పట్టుకుని ముందుకు లాగింది. కాలర్ ని పట్టుకునిచెంపలు చెడామడా వాయించేసింది. వెనక బాయ్ ఫ్రెండ్ ని ఎక్కించుకుని స్కూటీలో వెళ్తోంది ఆ మహిళ. ట్రాఫిక్ లో ముందుగా ఓ క్యాబ్ ఆగి ఉంది. పాపం ఆ డ్రైవర్ స్కూటీకి సైడ్ ఇవ్వలేదట. అంతే ఆమెకు కోపం కట్టలు తెంచుకుంది. ట్రాఫిక్ కాస్త సడలగానే.. సర్రున స్కూటీ తీసుకొచ్చి క్యాబ్ ముందు ఆపింది. డ్రైవర్ ని బయటకు లాగి చెంపలు వాయించేసింది. ఆడవాళ్లతో ఎందుకనుకున్నాడో ఏమో.. తప్పు లేకపోయినా ఆ డ్రైవర్ దెబ్బలు తిన్నాడు. ఈ వ్యవహారాన్ని చుట్టుపక్కలవారు సెల్ ఫోన్ లో చిత్రీకరించి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. దీంతో ఆమె ఓవర్ యాక్షన్ ని అందరూ తిడుతూ కామెంట్లు పెట్టారు. స్కూటీ నెంబర్ ఆధారంగా ఆమెను పోలీసులు వెదుకుతున్నారు.

   

   

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.