ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నో యువతి ప్రియదర్శిని గుర్తుంది కదా. మద్యం మత్తులో క్యాబ్ డ్రైవర్ ను చితకబాది వార్తల్లోకి ఎక్కింది. ఆమె చేసిన రచ్చంతా సోషల్ మీడియాలో రావడంతో ఆ లక్నో యువతి పేరు దేశమంతా మార్మోగింది. నెటిజన్లు ఆమెపై తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. అలాంటి ఘటనే మరొకటి లక్నోలో చోటుచేసుకుంది.
ఓ మహిళ ఆటో ఎక్కింది. ఆమెతో పాటు ఇద్దరు పురుషులు కూడా ఆటో ఎక్కారు. దిగాల్సిన చోట ఆటోవాలా దించాడు. దిగిన తర్వాత ఆటో డబ్బులు అడిగితే, ఇచ్చినంత తీస్కో అన్నారు. అలా కుదరదని ఆటోవాలా చెప్పాడు. అంతే, చెప్పుతో ఎడాపెడా వాయించేసింది ఆ మహిళ.
లక్నోలో ఓ మహిళ ఇద్దరు మగవాళ్ళతో కలిసి ఆటో ఎక్కింది. ఎక్కే ముందే బాడుగ మాట్లాడింది. గిట్టుబాటు కావడంతో ఆటో డ్రైవర్ కూడా వారిని ఎక్కించుకుని గమ్య స్థానానికి చేర్చాడు. అయితే ఆటో బాడుగ మాట్లాడుకున్నంత డబ్బుల్లో, సగం మాత్రమే వారు ఇచ్చారు. అక్కడి నుంచి గొడవ మొదలైంది. ముందు ఒప్పుకున్నంత డబ్బులు ఇవ్వాల్సిందేనంటూ ఆటోవాలా వారిని డిమాండ్ చేశారు. వాళ్ళు ససేమిరా అన్నారు. మాటామాటా పెరిగింది. సహనం కోల్పోయిన ఆ మహిళ, ఆటోవాలాపైకి దూసుకెళ్ళింది. అతని చెంపలపై టపటపా వాయించేసింది. అంతటితో ఆగకుండా చెప్పు తీసుకుని మరీ కొట్టింది. ఇదంతా అక్కడే ఉన్న చాలామంది చూస్తూ ఉండిపోయారు. ఆమెతో పాటు ఉన్న ఇద్దరు పురుషులు కూడా అతనిపైకి దూకారు. ఈ విషయాన్ని అక్కడ సమీపంలో ఉన్న పోలీస్‌కు ఆటో డ్రైవర్ చెప్పాడు. పోలీస్ వచ్చి మాట్లాడుతుండగా రెచ్చిపోయిన ఆ మహిళ, పోలీసు ముందే ఆటో డ్రైవర్‌ను చెత్తరేపేసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
विवाद किराए का, हिसाब चप्पल से।
थप्पड़ गर्ल के बाद अब चप्पल वाली महिला। लखनऊ के टेढ़ी पुलिया चौराहे का वीडियो वायरल। pic.twitter.com/HV8R8PMEdV— Gyan Bihari Mishra (@Gyanmishra_) August 21, 2021