మెర్సిడెస్ బెంజ్ నుంచి SUV లాంఛ్.

  0
  143

  మెర్సిడెస్ బెంజ్ కార్ల గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. దీనికున్న క్రేజ్ అంతాఇంతా కాదు. తాజాగా అత్యంత వేగవంతమైన ఎస్ యూవీని ప్రవేశపెట్టింది. మెర్సిడెస్ బెంజ్ ఇండియా విభాగం తాజాగా ఏఎంజీ జీఎల్ఈ 63ఎస్ 4మాటిక్ ప్లస్ కూపే SUV ని నేడు ఇండియాలో లాంచ్ చేసింది. దీని ధర రూ.2.07 కోట్లు (ఢిల్లీ ఎక్స్ షోరూం).

  దీంట్లో 612 హార్స్ పవర్ తో కూడిన శక్తిమంతమైన ట్విన్ టర్బో 4.0 లీటర్ వీ8 ఇంజిన్ ను పొందుపరిచారు. ఇది 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 3.8 సెకన్లలోనే అందుకోగలదు. ఈ వాహనం గరిష్ఠ వేగం గంటకు 280 కిలోమీటర్లు. ఏఎంజీ సిరీస్ లో ఇది 12వ మోడల్ కావ‌డం విశేషం. లాంబోర్ఘిని ఉరుస్, పోర్షే కయానే టర్బో, ఆడి ఆర్ఎస్ క్యూ8 మోడళ్లకు మెర్సిడెస్ బెంజ్ SUV గట్టిపోటీ ఇస్తుందని భావిస్తున్నారు.

  ఇవీ చదవండి..

  రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..

  ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ..

  తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

  పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్