భార్య కోసం ఓ భర్త తపస్సు ఫలించిన వేళ ..

  0
  687

  పేదవాడైన ఓ భర్త , కనిపించకుండాపోయిన భార్య కోసం , ఐదేళ్లు వెదికాడు.. దేశంలో దాదాపు సగం రైల్వే స్టేషన్లలో , బస్టాండ్లలో ఆమె కోసం కళ్ళలో వత్తులేసుకొని చూసాడు.. ఐదేళ్లకు భార్యను కనుగొన్న అమ్మన్ సింగ్ ప్రేమ చూసి హాస్పిటల్ సిబ్బంది , పోలీసులు కన్నీరు పెట్టారు.. ఇలాంటి భర్తలుకూడా ఉంటారా ..? అని ఆశ్చ్యర్యపోయారు. అమ్మన్ సింగ్ అత్తారి లో రైల్వే పోర్టర్ . భార్య , ముగ్గురు పిల్లలు.. ఐదేళ్ల క్రితం భార్యకి , మతిస్థిమితం లేకపోవడంతో అమృతసర్ హాస్పిటల్లో చేర్పించాడు. అక్కడినుంచి ఆమె బయటకు వచ్చేసి , ఇక కనిపించలేదు. అమ్మన్ సింగ్ ఆమెను వెదకడం మానలేదు.

  రెండో పెళ్లి చేసుకోమని చెప్పినా వినలేదు. దేశంలో అనేక ప్రాంతాలలో భార్యకోసం వెదికాడు. చివరకు పూణే నుంచి అత్తారి రైల్వే పోలీసుకు ఒక సమాచారం వచ్చింది. ఒక మహిళ ఎరవాడ మానసిక ఆసుపత్రిలో ఉందని , వివరాలు అడిగితే , అత్తారి రైల్వే స్టేషన్ , కూలీ అంటుందని దాని సారాంశం.. దీంతో అమ్మన్ సింగ్ లో భార్య ఆచూకీపై ఆశ మొలకెత్తింది.

  వెంటనే అక్కడికెళ్లి చూస్తే , హాస్పిటల్లో ఉన్నది తన భార్యేనని తెలుసుకొని , ఆనందంతో కన్నీరు పెట్టాడు.. అమ్మన్ సింగ్ భార్య కోసం పడిన తపన చూసి పోలీసులు , డాక్టర్లు కూడా కన్నీరుపెట్టారు.. ఆమె కూడా , భర్తను గుర్తించింది.. ప్రస్తుతం అక్కడే ఉంది ,కొన్ని రోజులు ట్రీట్మెంట్ చేయించి ఇంటికి తీసుకుళతానని అమ్మన్ సింగ్ చెప్పాడు..

  ఇవీ చదవండి..

  రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..

  ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ..

  తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

  పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్