చింపాంజీకి విరహవేదన, ఆమహిళకు ఇదీ శిక్ష

    0
    244

    చింపాంజీతో ప్రేమలో పడిందని ఓ మహిళను జూ లోకి రానీయకుండా ఆదేశాలు జారీ చేశారు. ఆ మహిళ వల్ల చింపాంజీ విరహ వేదన అనుభవిస్తోందని, తిండీ తిప్పలు లేకుండా ఆ మహిళ కోసమే ఎదురు చూస్తోందని జూ అధికారులు చెప్పారు. అందువల్ల ఆమెను మాత్రం జూ లోకి రానీయకుండా నిషేధం విధించారు. బెల్జియంలోని ఆంట్వార్క్ జూ లో గత నాలుగేళ్లుగా ఓ చింపాంజీతో ప్రేమలో పడింది. ఆమె పేరు ఎడి టిమ్మర్ మాన్స్. చిటా అనే ఈ చింపాంజీతో తాను ప్రేమలో ఉన్నానని, తాను జూ కి పోయినప్పుడల్లా గ్లాస్ పార్టీషన్ వద్ద ఇద్దరం చూపులు కలుపుకొని, ఫ్లైయింగ్ కిస్ లు ఇచ్చుకుని ఈ నాలుగేళ్లు ఆందంగా గడిపామని ఆ మహిళ చెప్పింది.

    ఈ మహిళతో ప్రేమలో పడినందువల్ల ఆ చింపాంజీ ఇతర ఆడ చింపాంజీలతో కలవడం లేదని, ఒకవేళ వచ్చినా దూరంగా నెట్టేస్తోందని జూ అధికారులు చెప్పారు. ఆమె ఎప్పుడొచ్చినా, ఆమెను చూస్తూ.. నవ్వులు చిందిస్తూ గ్లాస్ పార్టీషన్ వద్దకు వచ్చి ఆమె వైపే చూస్తూ ముద్దులు కురిపిస్తుందని అందువల్లనే ఆమెను జూ లోకి రాకుండా బ్యాన్ చేశామని అధికారులు చెప్పారు.  ఈ విషయమై టిమ్మర్ మాన్స్ స్పందిస్తూ, తాను ఆ చింపాంజీని ప్రేమిస్తున్నానని, అది కూడా తనను ప్రేమిస్తోందని, అంతకు మించి తామిద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదని, తనను చింపాంజీని ప్రేమించినందుకే, జూ లోకి రాకుండా చేయడం మరీ అన్యాయం అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయమై తాను కోర్టుకి వెళ్తానని స్పష్టం చేసింది. ఈ మహిళ వల్ల మిగిలిన చింపాంజీలు కూడా ఈ చిటా చింపాంజీని వేరు చేసి చూస్తున్నాయని తెలిపారు.

    ఇవీ చదవండి..

    రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..

    ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ..

    తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

    పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్