మైకంలో ఆమె కాళ్ళకు దండం పెట్టి, పాదాలు ముద్దాడి.

  0
  984

  హీరోయిన్లు నచ్చితే ఎవరైనా ఏం చేస్తారు, షేక్ హ్యాండ్ ఇస్తారు, లేదా ఓ హగ్ ఇస్తారు, ఇంకా ముద్దొస్తే బుగ్గపై ఓ ముద్దిస్తారు. కానీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేశాడో చూడండి. ఈ వీడియో చూస్తే మీ మతిపోతుంది. హీరోయిన్ ఇనయా సుల్తానా బర్త్ డే సందర్భంగా వర్మ ఇలాంటి పిచ్చి వేషాలు వేశాడు. ఆమెను కౌగిలించుకుని నలిపేశాడు, ఆమె కాళ్లపై పడ్డాడు, ఆమె చుట్టూ దండం పెడుతూ ప్రదక్షిణలు చేశాడు. మందు మైకంలో వర్మ ఇలా చేశాడని అనుకున్నా.. ఆ తర్వాత ఆయన పెట్టిన ట్వీట్ చూస్తే మాత్రం ఆయన ఎంత వెరైటీ మనిషో అర్థమవుతుంది.

  “మీ అందరికి ఓ విషయంపై స్పష్టత ఇవ్వాలనుకుంటున్నా. ఈ వీడియోలో ఉన్న వ్యక్తి నేను కాదు. ఆ రెడ్‌డ్రెస్‌లో ఉన్న అమ్మాయి ఇనయా సుల్తానా అసలే కాదు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మీద ఒట్టు” అంటూ తనదైన స్టైల్‌లో ఆర్జీవీ క్లారిటీ ఇచ్చాడు. కాగా ఈ వీడియోలో వర్మ రంగీలా మూవీలోని పాటకు ఇనయాతో కలిసి స్టెప్పులు వేశాడు. అంతేగాక మధ్యలో ఆమె కాళ్లు పట్టుకుని విచిత్రంగా వ్యవహరించాడు.

  కాగా ఇనయా సుల్తానా ఆర్జీవీ కొత్త సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేగాక ఆమె ధన్ రాజ్ హీరోగా వస్తోన్న మరో చిత్రంలో కూడా నటిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ‘బుజ్జి ఇలా రా’ యూనిట్ శనివారం ఆమె బర్త్ డే వేడుకను సెలెబ్రేట్ చేశారు. ఇందులో భాగంగా మద్యం సేవించిన ఆర్జీవీ ఆమెతో ఇలా డ్యాన్స్‌ చేశాడు.

  ఇవీ చదవండి..

  రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..

  ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ..

  తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

  పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్