చెమట కంపుతో డేటింగ్ కి గుడ్ బై..

  0
  7109

  డేటింగ్ యాప్ లు భారత్ లో నిషిద్ధం కానీ.. ఇతర దేశాల్లో మాత్రం బాగా ఫేమస్. డేటింగ్ యాప్స్ లో రిజిస్టర్ చేసుకుని ఓ అగ్రిమెంట్ కుదుర్చుకున్నవారికి చట్టాలు కూడా రక్షణ కల్పిస్తాయి. డేటింగ్ లో ఏవైనా సమస్యలొస్తే వాటిపై కోర్టుకెళ్లేందుకు కూడా వారికి హక్కుంది.

  అలా కెనడాలోని ఎమిలీ మేకినన్ అనే ఓ మహిళ.. ఓ టిక్ టాక్ స్టార్ ని టిండర్ డేటింగ్ యాప్ లో కలిసింది. వారిద్దరూ ఓ అండర్ స్టాండింగ్ కి వచ్చారు. సరసాలాడుకోడానికి హోటల్ రూమ్ తీసుకున్నారు. తీరా రూమ్ కి వెళ్లాక అయ్యగారి అసలు వాసన బయటపడింది.

  మనోడు పైకి కనపడేంత నీటుగాడు కాదు. మడ్డిరకం, ఒంటిపై చెమటకంపుని సెంటుతో కవర్ చేసుకున్నా.. తీరా శృంగారం మొదలై బట్టలు ఊడదీసే సమయానికి ఆ కంపుని భరించలేకపోయింది ప్రియురాలు. బనీన్ తీస్తే వాసన గబ్బు, ఇక అండర్ వేర్ ఊడదీస్తే.. ముక్కు పుటాలు అదిరిపోయాయి. మూడ్ రావడం అటుంచి, వాంతి వచ్చేట్టుగా ఉందని ఎమిలీ అదిరిపడింది. నీతో నాకు పొత్తు కుదరదు పొమ్మని చెప్పింది.

  దీంతో ప్రియుడు హర్ట్ అయ్యాడు. మనిద్దరం డేటింగ్ యాప్ లో కలిశాం కదా, మన కాంట్రాక్ట్ వద్దని చెప్పడానికి కుదరదు నీపై కేసు వేస్తానన్నాడు. దీంతో ఎమిలీ కూడా ఎదురు తిరిగింది. నీపైనే కేసు వేస్తానంటూ హెచ్చరించింది. నీ శరీరం నుంచి వచ్చే దుర్వాసన నాకు పడటంలేదు, మన కాంట్రాక్ట్ రద్దయిపోయిందని చీదరించుకుంది. పోడ్ కాస్ట్ లో కూడా ఈ విషయాలను బయటపెట్టింది. ప్రస్తుతం ఈ కేసు కెనడాలో హాట్ టాపిక్ గా మారింది.

  ఇవీ చదవండి..

  లా చదివిన ఆమె.. లారీ డ్రైవర్ ఎందుకయింది..?

  వుహాన్ ప్రయోగశాలలో రహస్య గదిలో గబ్బిలాలు.

  అందాల రాసి రాశీఖ‌న్నా ఓ సైకో అట‌..

  కొత్త కోడలుకి .అత్తగారింటి నోట్ల కట్టలతో స్వాగతం.మెట్టుమెట్టుకి ఒక నోట్ల కట్ట .. చూడండి. తమాషా..