అవ్వ అయినా అమ్మాయిగా మోసంచేసి..పెళ్లాడింది..

  0
  1146

  50 ఏళ్ళ వయసులో , 35 ఏళ్ళ మహిళమాదిరి మేకప్ వేసుకొని , ఓ వ్యక్తిని బుట్టలో వేసుకొని పెళ్ళాడేసింది.. అంతకుముందే ఆమెకు మూడు పెళ్లిళ్లు అయ్యాయి.. ముసలిదైనా , పడుచు యువతిలాగానే మేనేజ్ చేసింది.. ఇంతకీ ఈమె పేరు శరణ్య.. ఉండేది పుత్తూరులో.. విలాసాలకు అలవాటు పడ్డ శరణ్య , మొగుళ్లను మార్చి , వాళ్ళను ఏమార్చి డబ్బులు పిండటమే పనిగా పెట్టుకుంది. అయిపోయిన తరువాత , మరొకడ్ని వెదుక్కుంటుంది. చెన్నైకి చెందిన హరి అనే 44 ఏళ్ళ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ , ఇదివరకే మనస్పర్థలతో భార్యకు విడాకులు ఇచ్చాడు,. వివాహం చేసుకునేందుకు పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు.

  ఒక బ్రోకర్ ద్వారా శరణ్యను చూసాడు. 54 ఏళ్ళ శరణ్య , తనకు 35 ఏళ్లని బుకాయించింది. పాపం , నమ్మేశాడు.. పెళ్ళైన తరువాత సినిమా చూపించింది. ఆస్తులు తనపై రాయమని వత్తిడి చేసింది. అత్తా , భర్తపై వరకట్న , గృహ హింస కేసులు పెట్టింది. దీంతో హరి , అతడి తల్లికి ఈమె మీద అనుమానమొచ్చి ఆవడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేపట్టగా శరణ్య నిజమైన పేరు సుగణ అని ఈమెకు 50 ఏళ్లని తేలింది. ఈమెకు ఇది వరకే తిరుపతికి చెందిన రవి అనే వ్యక్తితో వివాహం జరిగి ఇద్దరు కుమార్తెలున్నట్లు తెలిసింది. దీంతో ఆవడి పోలీసులు శరణ్యను అరెస్ట్‌ చేసి ప్రశ్నిస్తున్నారు.

  విచారణలో మరో పెళ్లి బయటపడింది. తిరుపత్తూరు జిల్లా జోలార్‌పేట సమీపంలోని వక్కనంపట్టి గ్రామానికి చెందిన సుబ్రమణి శనివారం ఆవడి పోలీసులకు ఓ ఫిర్యాదు చేశాడు. అందులో తాను సేలం, ఈరోడ్డు, కాట్పాడి వంటి రైల్వేస్టేషన్‌లోని క్యాంటిన్‌లో పని చేస్తున్నానని 2010లో ఆరణికి చెందిన ఏజెంట్‌ ద్వారా శరణ్యకు తనకు వివాహం జరిగిందని పేర్కొన్నాడు. తన వద్ద ఆమె పేరును సంధ్య అని తెలిపిందన్నారు. గత పదేళ్లుగా శరణ్యతో తాను జీవించానని తమకు పిల్లలు లేదని 2021 జూలైలో మేట్టుపాళ్యంలో రైల్వే క్యాంటీన్‌లో పనికి వెళ్లిన సమయంలో శరణ్య తనను వదిలి వెళ్లి పోయిందని అందులో పేర్కొన్నాడు. మరో రెండు పెళ్లిళ్ల పైకూడా విచారణ జరుగుతొంది..

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.