నా రాకపై కోట్లు పందెంకాసి పోగొట్టుకున్నారు.

  0
  479

  ఉభయ గోదావరి జిల్లాలు పందెం రాయుళ్లకు పెట్టింది పేరు.. గల్లీ నుంచి ఢిల్లీ వరకూ దేని మీదైనా పందేలు కాయడం ఇక్కడి వారి స్పెషాలిటీ.. పండుగల సందర్భంలోనూ దేశ విదేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి పందేలు కాస్తుంటారు. కోళ్ల పందేలు, ఎద్దుల పోటీలు.. ఇలా అన్నింటిపైనా పందేలు కాస్తుంటారు. ఎన్నికల సమయంలో రాజకీయనేతల గెలుపోటములపై కూడా పందేలు కాసుకుంటారు.
  అయితే తాజాగా ఇక్కడ ఓ వినూత్నమైన విషయంలో పందేలు పెట్టుకున్నారు.

  ఈ పందేల్లో కోట్లాది రూపాయలు చేతులు మారినట్టు తెలుస్తోంది. ఆ పందెం దేనిమీద అంటే.. ఎంపీ రఘురామ కృష్ణరాజు భీమవరం వస్తాడా.. రాడా.. అనే విషయంపై జోరుగా పందేలు కాసినట్టు సమాచారం. రాజు అనుచరులు, వైసీపీ నేతలు ఈ విషయంపై కోట్లలో పందేలు పెట్టుకున్నారు.

  ప్రధాని పర్యటనలో ఎంపీ హోదాలో రఘురామకృష్ణ రాజు పాల్గొంటారని అందరూ భావించారు. రఘురామ కృష రాజు కూడా లైవ్ పెట్టి మరీ ఈ విషయాన్ని తెలియజేశాడు. కేంద్ర ప్రభుత్వం కూడా ఆయనకు జడ్ ప్లస్ సెక్యూరిటీని ఇచ్చింది. దీంతో సెక్యూరిటీతో కలిసి రఘురామా కృష్ణరాజు నరసాపురం ఎక్స్ ప్రెస్ కూడా ఎక్కాడు.. అయితే చివరి నిమిషంలో పీఎంవో నుంచి వచ్చిన లిస్ట్ లో తన పేరు లేకపోవడంతో ఆయన మధ్యలోనే ట్రైన్ దిగేసి వెనక్కి వెళ్లిపోయారు. దీంతో ఈ పందెంలో రాజు అనుచరులు భారీగా డబ్బును పోగొట్టుకున్నట్టు తెలుస్తోంది. ఈ విషయం సాక్షాత్తు ఎంపీ రఘురామారాజే చెప్పాడు.

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.